end

సింగూరు ప్రాజెక్టుకు జలకళ

  • కొనసాగుతున్న వరద ప్రవాహం
  • ప్రాజెక్టును సందర్శించిన జిల్లా కలెక్టర్‌
  • 5 గేట్ల ద్వారా నీటిని వదిలిన అధికారులు

సంగారెడ్డి జిల్లా సింగూర్ ప్రాజెక్టు నాలుగేళ్ల తర్వాత ప్రాజెక్టు నీటితో కళకళలాడుతుంది. సింగూర్ జలకళను సంతరించుకుంది. మంగళవారం కురిసిన వర్షానికి ప్రాజెక్టు లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, 1.28 లక్షల క్యూ సెక్యుల వరద నీరు ఇన్ ఫ్లో రావడంతో బుధవారం తెల్లవారుజామున అధికారులు 6,11,13,14,15 నంబర్ల గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు.

ఆకాశానికి చిల్లు పడింది..

బుధవారం మధ్యాహ్నం వరకు 50 వెల క్యూ సేక్కుల ఇన్ ఫ్లో కు తగ్గడంతో రెండు గేట్లను మూసివేశారు. సాయంత్రనికి 25 వెల క్యూ సెక్కుల ఇన్ ఫ్లోకు తగ్గడంతో, మిగతా 3 గేట్ల ద్వారా ప్రాజెక్టు సామర్థ్యం తగ్గకుండా నీటిని 28 వేల క్యూ సెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు 1 టీఎంసీ పైనే నీరు బయటకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

సింగూర్ ప్రాజెక్ట్ ను సందర్శించి అధికారులతో వివరాలు తెలుసుకుంటున్న జిల్లా కలెక్టర్

తెలంగాణలో వర్ష భీభత్సం

జిల్లా కలెక్టర్ హనుమంత రావు, ఆర్డీవో విక్టర్ లు ప్రాజెక్టును సందర్శించగా, ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ రామ స్వామి, ఏఈ మహిపాల్ రెడ్డి లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సింగూర్ పరివాహ‌క ప్రాంత రైతుల‌తో పాటు చెరువులు, కుంటల్లోకి నీరు వ‌చ్చి చేరుతుండ‌డంతో భూగ‌ర్భ జ‌లాలు వృద్ది చెంద‌డంతో, బోరు బావులపైన ఆధార‌ప‌డిన రైతులు సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తం మీద నాలుగేళ్ళ తర్వాత సింగూరులో మళ్ళీ వరద నీరు వచ్చి చేరడంతో రైతాంగం…ప్ర‌జ‌లు నీటి స‌మ‌స్య తీరిందంటూ ఊపిరిపీల్చుకుంటున్నరు.

ఫలించిన సెంటిమెంట్:

ప్రతి నాలుగేళ్లకోసారి సింగూర్ ప్రాజెక్టు లోకి పూర్తి స్థాయికి మించి వరద నీరు రావడం, దిగువకు నీటిని వదలడం సెంటిమెంట్ గా వస్తుంది. 1999 నుంచి ప్రారంభమైన సెంటి మెంటు ప్రతి నాలుగేళ్లకొకసారి నిండుతూ వచ్చింది. 2016లో ప్రాజెక్టు లోకి 105 టీఎంసీల వరద నీరు రావడంతో, 69 టీఎంసీల నీటిని దిగువకు వదిలారు. ఈ సారి సెంటిమెంటు నిలబడుతుందో లేదో అన్న సందేహం లో ఉన్న ఇక్కడి ప్రాంత రైతాంగానికి మంగళవారం నాడు కురిసిన వర్షానికి ప్రాజెక్టులోకి సామర్ధ్యానికి (29.917 టీఎంసీలకు) మించి అధికంగా వరద నీరు రావడంతో నీటిని దిగువకు వదిలడంతో సెంటిమెంట్ ఫలించినట్లైంది.

గ్రేటర్‌ హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు

సాగుకు భరోసా

సింగూర్ ప్రాజెక్టులో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో సాగుకు భరోసా కలిగింది.
సింగూర్ నుంచి ప్రతి ఏడాదికి వ‌న‌దుర్గ ప్రాజెక్టు (ఘ‌న‌పూర్‌)4.06 టీఏంసీలు, నిజాంసాగ‌ర్‌కు 8.35 టీఎంసీలు, 2 టీఏంసీఎలు అందోలు, పుల్కల్‌, మునిప‌ల్లి, స‌దాశివ పేట మండ‌లాల ప‌రిధిలోని 150 చెరువులు…48 ఎక‌రాల సాగుకు రెండు ప‌ర్యాయాలు నీటిని వదిలే అవకాశం ఉండడంతో ఆయా రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

దిక్కుమాలిన ‘బిగ్‌బాస్‌’

ప‌ర్యాట‌కుల సంద‌డిః

సింగూర్ ప్రాజెక్టులోకి వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరడంతో నీటిని దిగువకు విడుదల చేయడంతో ప్రాజెక్టు పరిసరాలు ప‌ర్యాట‌కుల‌తో సంద‌డిగా మారింది. జిల్లాలో ఏకైక పెద్ద ప్రాజెక్టు కావ‌డం, జంట న‌గ‌రాల‌కు 60 కిలో మీట‌ర్ల దూరంలోనే ఉండ‌డం, ప‌రిస‌ర ప్రాంతాల‌కు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో నీటిని చూసేందుకు త‌ర‌లి వ‌‌స్తున్నారు. ప్రాజెక్టు పైకి అనుమతి లేకపోవడంతో, సదాశివపేట వైపు వెళ్లే వంతెన వద్దకు చేరుకొని, గేట్లు ఎత్తిన దృశ్యాలను తిలకిస్తున్నారు.

పాలిసెట్‌ అర్హత మార్కులు 25 శాతానికి తగ్గింపు

ప్రాజెక్టు వద్ద జోరుగా వ్యాపారం:

ప్రాజెక్టును న‌మ్ముకుని స‌మీపంలో సామాన్యులు చిన్న చిన్న హోట‌ల్‌లు ఎన్నో ఎండ్ల కింద‌ట ఏర్పాటు చేసుకున్నారు. పర్యాట‌కుల‌కు రుచిక‌రమైన భోజ‌నాన్ని వండి ఇవ్వడం ఇక్కడ జ‌రుగుతుంది. గ‌డిచిన మూడేళ్లుగా ప్రాజెక్టులో నీరు లేక‌పోవ‌డంతో ప‌ర్యాట‌కుల సంద‌డి కూడా లేకుండా పోవ‌డంతో, కొంద‌రు వారికున్న చిన్నపాటి హోటళ్లు మూసివేశారు. ఈ సారి నీటి సామ‌ర్థ్యం పెర‌గ‌డంతో, పర్యాట‌కుల సంఖ్య పెర‌గ‌డంతో మూత‌ప‌డిన హోట‌ళ్లు మ‌ళ్లీ తేరుచుకున్నాయి. హ‌రిత హోట‌ల్ ఉన్నప్పటికీ, ఈ చిన్న హోట‌ళ్ల భోజ‌నానికే ప‌ర్యాట‌కులు ఇష్టపడటం విశేషం. ప్రాజెక్టు వ‌ద్ద చేప‌లు, జోన్న రొట్టేల‌కే ఎక్కువ‌గా గిరాకీ ఉంటుంద‌ని వారు చెబుతున్నారు.

Exit mobile version