end

సింగూరు ప్రాజెక్టుకు జలకళ

  • జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు
  • కొనసాగుతున్న వరద…
  • ప్రస్తుత ప్రాజెక్టు నీటి మట్టం 14 టీఎంసీలు
  • నిండుతున్న చెరువులు…. కుంటలు…

ఆందోల్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. మూడు రోజులుగా కురిసిన వర్షానికి నీటి వనరులు సంతరించుకున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావడంతో చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. అందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్ తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. అక్కడ అక్కడ పత్తి చేనులోకి నీరు రావడంతో పత్తి పంటలు నీటమునిగాయి. భారీ వర్షానికి శిథిలావస్థకు చేరిన ఇండ్లు కూడా కూలిపోయాయి.

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ అడ్మీషన్లు ప్రారంభం

సింగూరుకు సంతరించుకున్న జలకళ:

మూడు రోజులుగా ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు సింగూర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. గత వారం రోజుల క్రితం ప్రాజెక్టులో 3 టీఎంసిలు ఉండగా గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు రావడంతో 14 టీఎంసీల కు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, వరద ఉధృతి పెరుగుతుండడంతో మరో 2 టిఎంసిల వరకు నీటి మట్టం చేరే అవకాశం ఉందని ఇరిగేషన్ ఏఈ మహిపాల్ రెడ్డి తెలిపారు. వరదలు పెరుగుతున్నందున లోతట్టు ప్రాంతాలకు రైతులు, గొర్రెల కాపరులు, మత్స్యకారులు వెళ్ళొద్దని ఆయన సూచించారు. సింగూర్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి మొదలైంది.

వాగులో కొట్టుకుపోయి మహిళ మృతి

అక్టోబర్ 5 నుంచి అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ పరీక్షలు

Exit mobile version