end

మా సమస్యలు పరిష్కరించండి సారూ..

  • మెదక్ ఇన్చార్జి అడిషనల్ ఎస్పీ కి ఫిర్యాదు చేసిన బాధితులు

కేకేఆర్ ‘సూపర్‌’ విక్టరీ..

జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఇంచార్జ్ ఎస్పీ జోయల్ డేవిస్ ఆదేశాలతో ఇంచార్జ్ అదనపు ఎస్పీ సీతారాం జిల్లా కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెదక్ పట్టణంలోని ఫతేనగర్‌కి చెందిన దుంపల నర్సమ్మ భర్త వెంకట్ 2007 సంవత్సరంలో దుంపల భూమయ్య తండ్రి లక్ష్మయ్య వద్ద 20 గుంటల భూమిని 30,000 రూపాయలకు కొన్నాడు అనీ.. ఇట్టి విక్రయానికి తమ బస్తివాసులు సాక్ష్యం ఉన్నారనీ, ప్రస్తుతం భూమి రేట్లు పెరినందున తనకు భూమి అమ్మినటువంటి వ్యక్తి వాటా ఇవ్వాలని తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వారు పోలీసులకు తెలిపారు. తనను ఇబ్బందులకు గురిచేస్తున్న వ్యక్తి పై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీఎం దసరా కానుక బతుకమ్మ చీరలు ..

మెదక్ పట్టణం గాంధీనగర్ కు చెందిన వడ్ల స్వాతి భర్త హరిప్రసాద్ గత 6 సంవత్సరాల క్రితం కుటుంబ పరిస్థితుల వల్ల ఇల్లు విడిచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం వారు.. వారి ఇంటికి వెళ్తే ఇంట్లో ఉన్న వారి బావ చంద్రశేఖర్, సోదరి ఉషా, మామ వడ్ల శ్రీరాములు, అత్త పార్వతిలు ఇంట్లోకి రానివ్వడం లేదన్నారు. ఆ ఇల్లు కట్టే సమయంలోనే తాము లక్ష రూపాయలు ఇచ్చామని వారు తెలిపారు. ఇప్పుడు ఆ డబ్బులు అడిగితే ఇవ్వమంటూ మమ్మల్ని ఇంట్లోకి రానివ్వటం లేదనీ.. కావున ఇట్టి విషయంలో తమకు తగిన న్యాయం చేయాలని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై జిల్లా అదనపు ఎస్పీ స్పందిస్తూ.. సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు బాధితులకు చట్టప్రకారం తగిన న్యాయం చేయాలని ఆదేశించారు.

మానేరు డ్యాంలో పడి రెండేళ్ల బాలుడు మృతి

Exit mobile version