టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌కు సమయం దగ్గర పడుతుండడంతో కెప్టెన్‌తో పాటు మిగితా ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో మునిగారు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు సరిగ్గా నెల రోజుల సమయముంది. దానికి ముందు టీమిండియా వన్డే, టి20 సిరీస్‌లు ఆడాల్సి ఉంది. అయితే టెస్టులకు ఉన్న ప్రాధాన్యత వల్ల కావచ్చు అప్పుడే వాటి కోసం మన ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. పైగా ఐపీఎల్ కారణంగా ఇప్పటి వరకు మన ఆటగాళ్లంతా తెల్ల బంతితో ఫుల్ ప్రాక్టీస్ లభించిందని చెప్పవచ్చు.
భారత జట్టు టాప్ పేస్ బౌలర్ మొహమ్మద్ షమీతో పాటు మరో పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఎరుపు, గులాబీ బంతులతో బౌలింగ్ చేశారు. వీరిద్దరు కెప్టెన్ కోహ్లి, కేఎల్ రాహుల్ సహా ఇతర బ్యాట్స్‌మెన్‌కు సుదీర్ఘ సమయం పాటు బౌలింగ్ చేశారు. కోహ్లి కూడా ‘టెస్టు క్రికెట్ ప్రాక్టీస్ సెషన్లను ఇష్టపడతాను’ అంటూ కామెంట్ చేయడం టీమిండియా సన్నాహాల గురించి చెబుతోంది. ఈ టూర్‌లో భాగంగా భారత్ ఈ నెల 27న ఆస్ట్రేలియాతో తొలివన్డే ఆడనుంది.