end
=
Friday, September 20, 2024
వార్తలురాష్ట్రీయంTelangana High Court:ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ విచారణకు ఓకే
- Advertisment -

Telangana High Court:ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ విచారణకు ఓకే

- Advertisment -
- Advertisment -

  • కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు
  • వారి పర్యవేక్షణలోనే జరుగుతుందని స్పష్టం

తెలంగాణ (Telangana) రాజకీయాల్లో ఎమ్మెల్యేల(MLA) కొనుగోలు కేసు ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఫాంహౌస్ (Form House)ఎమ్మెల్యేల(MLA) కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించేందుకు హైకోర్టు (Telangana High Court) నిరాకరించిందన్నారు ప్రభుత్వ తరపు న్యాయవాది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (Hyderabad Police Commissioner) ఆధ్వర్యంలోని సిట్ బృందం దర్యాప్తు చేస్తుందని సిట్ విచారణను సింగిల్ జడ్జి (Judge) మానిటరింగ్ చేస్తారని న్యాయస్థానం తెలిపింది.

ఫాంహౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి (CBI)అప్పగించేందుకు హైకోర్టు నిరాకరించిందన్నారు ప్రభుత్వ తరపు న్యాయవాది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలోని సిట్ బృందం దర్యాప్తు చేస్తుందని.. సిట్ విచారణను సింగిల్ జడ్జి మానిటరింగ్ చేస్తారని న్యాయస్థానం తెలిపింది. దర్యాప్తు నివేదికను ఈనెల 29వ తేదీన సిట్ సింగిల్ జడ్జికి సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించిందన్నారు. దర్యాప్తు పారదర్శకంగా ఉండాలని.. విచారణకు సంబంధించిన వివరాలు ముఖ్యమంత్రి (CM) కార్యాలయానికి గాని, అధికారులకుగాని, మీడియాకు, రాజకీయ నాయకులకు లీక్ చేయొద్దని కోర్టు స్పష్టం చేసిందన్నారు. ఒకవేళ దర్యాప్తు వివరాలు బయటికి వస్తే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని న్యాయస్థానం హెచ్చరించిందని తెలిపారు. మరోవైపు ప్రెస్ మీట్‌లో సీఎం కేసీఆర్ (KCR) పాంహౌస్ వీడియోలు, వివరాలు చెప్పడంపై ప్రభుత్వ తరపు న్యాయవాది విచారం వ్యక్తం చేశారన్నారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని కోర్టుకు హామీ ఇచ్చామన్నారు ప్రభుత్వ తరపు న్యాయవాది.

(CM KCR:ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదు)

ఇదిలావుంటే.. నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిట్ (Seat)విచారణ జరపాలన్న హైకోర్టు నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని రాష్ట్ర బీజేపీ (BJP) అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) తెలిపారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వులపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నామన్నారు. సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిట్ విచారణ జరపాలన్నదే బీజేపీ కోరుకుంటుందన్నారు. హైకోర్టు ఉత్తర్వులతో విచారణ పారదర్శకంగా జరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు. బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీపై ఆరోపణలు చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించడమే దీనికి నిదర్శనమని అన్నారు. ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ (Press meet)నిర్వహించడంపై హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు అభినందనీయమన్నారు. అంతేకాదు తప్పు చేసినవాళ్లకు, కుట్రదారులకు శిక్ష పడాల్సిందేనన్నారు. తెలంగాణ ప్రజలు కూడా కోరుకునేది ఇదే అని బండి సంజయ్ తెలిపారు. హైకోర్టు ధర్మాసనంపట్ల తమకు నమ్మకం ఉందన్నారు. వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెనుక కుట్రదారులెవరన్నది తేలడంతో పాటు దోషులకు తగిన శిక్ష పడుతుందనే నమ్మకం ఉందని బండి సంజయ్ స్పష్టం చేశారు. దీంతో తెలంగాణలో రాజకీయం మరోసారి హీటెక్కె చాన్స్ కనిపిస్తోంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -