end

రూ.6 కోట్ల విలువ డ్రగ్స్‌ పట్టివేత

జిన్నారంలోని ఓ ఫార్మా కంపెనీ డ్రగ్స్‌ బయటపడ్డాయి. దీంతో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేగింది. సుమారు 50 కిలోల నార్కోటిక్‌ డ్రగ్స్‌ని డి.ఆర్‌.ఐ అధికారులు పట్టుకున్నారు. సుమారు రూ.6 కోట్ల రూపాయల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ డ్రగ్స్‌ దొరకుండా ఉండేందుకు భూమి లోపల పాతిపెట్టారు. అయినా సరే డి.ఆర్‌.ఐ అధికారులు చాకచక్యంగా వ్యవహరించి డ్రగ్స్‌ను భూమిలో నుండి వెలికితీశారు.

Exit mobile version