end
=
Saturday, November 23, 2024
క్రీడలుRRకు స్వల్ప లక్ష్యం.. గెలుపు దిశగా స్మిత్‌ సేన
- Advertisment -

RRకు స్వల్ప లక్ష్యం.. గెలుపు దిశగా స్మిత్‌ సేన

- Advertisment -
- Advertisment -

కేకేఆర్ ‘సూపర్‌’ విక్టరీ..

చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య జరుగుతున్న రెండోదశ లీగ్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి, కేవలం 125 పరుగులు మాత్రమే చేసింది. రవీంద్ర జడేజా(35 పరుగులు; 4 ఫోర్లు), కెప్టెన్‌ ధోని(28 పరుగులు), ఓపెనర్‌ సామ్‌ కర్రన్‌(22 పరుగులు) సాధించబట్టే చెన్నై ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

మలబద్దకం ఉన్న వాళ్లు ఈ టిప్స్‌ పాటిస్తే సరి..

ఆర్‌ ఆర్‌ బౌలర్లలో ఆర్చర్‌, త్యాగి, శ్రేయాస్‌ గోపాల్‌, తెవాటియా తలో వికెట్ పడగొట్టారు. జోఫ్రా ఆర్చర్‌, శ్రేయాస్‌ గోపాల్‌, తెవాటియా చాలా పొదుగుగా బౌలింగ్‌ చేసి, చెన్నై బ్యాట్స్‌మెన్‌ను ఏ విధంగానూ కోలుకోనీయలేరు. 126 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన రాజస్తాన్‌ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మూడో ఓవర్లో 26 పరుగుల వద్ద ఓపెనర్‌ బెన్‌స్టోక్స్‌(19పరుగులు; 3 ఫోర్లు), నాలుగో ఓవర్లో మరో ఓపెనర్‌ రాబిన్‌ ఉతప్పను హెజెల్‌వుడ్‌ ఔట్ చేశాడు.

మా సమస్యలు పరిష్కరించండి సారూ..

ఐదో ఓవర్‌ 3బంతికి ఫామ్‌లో ఉన్న సంజూ సాంసన్‌ను దీపక్‌ చాహర్‌ డకౌట్‌ చేశాడు. ఇలా వరుస ఓవర్లలో 3 వికెట్లు పడేసరికి ఆర్‌ ఆర్‌ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ స్మిత్‌(20 బ్యాటింగ్‌), జోస్‌ బట్లర్‌(62 నాటౌట్) ఆచితూచి ఆడుతూ, రన్‌ రేట్‌ ఎక్కడా తగ్గకుండా స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. రాయల్స్‌ విజయం సాధించాలంటే 20 బంతుల్లో కేవలం 10 పరుగులు చేస్తే చాలు.

ఎన్‌కౌంటర్‌లో నలుగరు మావోయిస్టులు హతం

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -