సిడ్నీ: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్టీవెన్ స్మిత్ సెంచరీతో చెలరేగాడు. 226 బంతులు ఎదుర్కొన్న స్మిత్ 131 పరుగులు చేశాడు. అందులో 16 బౌండరీలున్నాయి. తొలిరోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య ఆస్ట్రేలియా.. అందుకనుగుణంగా భారీస్కోరు చేసింది. 105.4 ఓవర్లలో ఆసీస్ 338 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను త్వరగానే పెవిలియన్‌కు పంపినప్పటికీ.. మరో ఓపెనర్ విల్ పుకోవ్‌స్కి(110 బంతుల్లో 62; 4 ఫోర్లు), లబుషేన్(196 బంతుల్లో 91 పరుగులు; 11 ఫోర్లు) రాణించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. సెంచరీ దిశగా సాగుతున్న మార్నస్ లబుషేన్‌ను జడేజా ఔట్ చేశాడు. భారత బౌలర్లలో జడేజా 4 వికెట్లతో చెలరేగగా.. సైనీ, బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. సిరాజ్ ఓపెనర్ వార్నర్ వికెట్ తీశాడు.