end
=
Monday, January 20, 2025
ఫీచ‌ర్స్ ‌లైఫ్‌Smoking:మహిళలపై తీవ్ర ప్రభావం చూపుతున్న స్మోకింగ్..
- Advertisment -

Smoking:మహిళలపై తీవ్ర ప్రభావం చూపుతున్న స్మోకింగ్..

- Advertisment -
- Advertisment -

  • వీలైనంత త్వరగా మానేయాలంటున్న వైద్యులు
  • ప్రతికూల ప్రభావాల్లో స్త్రీ పురుషుల మధ్య తేడాలు
  • మేల్స్ కంటే ఫిమేల్స్‌‌ స్మోకింగ్ మానడం కష్టం
  • నికోటిన్‌తో బ్రెయిన్‌లో ఈస్ట్రోజెన్ ఉత్పత్తికి బ్రేక్
  • కొత్తగా కనుగొన్న వియన్నాలోని పరిశోధకులు

సిగరెట్ స్మోకింగ్ (Cigarette smoking).. జెండర్‌తో (Gender)సంబంధం లేకుండా ఎవరి ఆరోగ్యానికైనా(Health)ప్రమాదమే. కానీ ప్రతికూల ప్రభావాల (Adverse effects)విషయంలో ఆడ (female), మగ (male)మధ్య తేడాలుంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఒక సిగరెట్‌లోని నికోటిన్ (Nicotine)మోతాదు మొత్తం ఈస్ట్రోజెన్‌ (Estrogen)ను ఉత్పత్తి చేయకుండా మహిళల మెదళ్లను నిరోధిస్తుందని తెలుస్తోంది. పైగా పురుషుల కంటే స్త్రీలు స్మోకింగ్ మానేయడం ఎందుకు ఎక్కువ కష్టమనే కారణంతో పాటు స్మోకర్స్‌లో (smokers) అనేక రకాల బిహేవియరల్ డిఫరెన్సెస్‌ (Behavioral differences)ను ఇది వివరించవచ్చు. ఈ మేరకు వియన్నా (Vienna)లోని  ECNP(యూరోపియన్ కాలేజ్ ఆఫ్ న్యూరోసైకోఫార్మకాలజీ) కాంగ్రెస్.. సంబంధిత ప్రమాదాల గురించి లోతుగా పరిశోధించేందుకు ప్రయత్నిస్తోంది.

(Dating:పెళ్లికి ముందు డేటింగ్.. బెస్ట్ ఆప్షన్ కోసమేనా?)

ప్రధాన పరిశోధకురాలు, అసోసియేట్ ప్రొఫెసర్ ఎరికా కొమాస్కో (Erica Comasco) (ఉప్సల యూనివర్సిటీ, స్వీడన్) ప్రకారం.. నికోటిన్ మహిళల మెదడులోని ఈస్ట్రోజెన్ ప్రొడక్షన్ మెకానిజం (mechanism)ను షట్ డౌన్ (shut down)చేస్తుంది. ఒక సిగరెట్‌కు సమానమైన నికోటిన్‌ డోస్‌‌తో స్త్రీ మెదడుపై ధూమపానం ప్రభావం ఎంత శక్తివంతంగా ఉంటుందో ఈ పరిశోధన చూపిస్తుంది. ఈ విషయం నూతనంగా కనుగొనబడగా.. ప్రతికూల ఫలితాలపై పరిశోధకుల అధ్యయనం ప్రాథమిక దశలోనే ఉంది. ప్రవర్తనా లేదా అభిజ్ఞా ఫలితాల గురించి తమ వద్ద పూర్తి సమాచారం లేదు. నికోటిన్ మెదడులోని పర్టిక్యులర్ (Particular) ప్రాంతంలో మాత్రమే పని చేస్తుంది. అయినప్పటికీ ప్రభావితమైన మెదడు వ్యవస్థ.. నికోటిన్ వంటి అడిక్టివ్ డ్రగ్స్‌ (Addictive drugs)కు లక్ష్యంగా ఉంటుందని రీసెర్చర్స్ (Researchers) గమనించారు. థాలమస్ (thalamus)(మెదడు ఎట్ ఆకారంలో ఉండే భాగం) ఇందుకు సంబంధించిన ప్రభావాన్ని ప్రదర్శించింది. ఈ వ్యవస్థ ప్రవర్తన, భావోద్వేగాలను నియంత్రించడంలో పాల్గొంటుంది.

నికోటిన్‌కు మహిళల్లో భిన్న స్పందన :

స్వీడన్‌లోని ఉప్సలా యూనివర్సిటీ (Uppsala University in Sweden) పరిశోధకుల సాయంతో పది మంది ఆరోగ్యవంతులైన మహిళా వలంటీర్లు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. వీరు కమర్షియల్ సోర్స్ (Commercial source) నుంచి నికోటిన్ (Nicotine) ఇంట్రానాసల్ మోతాదును స్వీకరించారు. అంతేకాదు ఈస్ట్రోజెన్‌ ఉత్పత్తిని నియంత్రించే ‘ఈస్ట్రోజెన్ సింథేస్(ఆరోమాటేస్) అని పిలువబడే రేడియోయాక్టివ్ ట్రేసర్‌ బౌండ్ ఇంజెక్షన్ (Radioactive tracer bound injection) పొందారు. ఆరోమాటేస్ అనేది ఈస్ట్రోజెన్‌ను ఉత్పత్తి చేసే ఎంజైమ్. MRI, PET మెదడు చిత్రాలను ఉపయోగించి పరిశోధకులు మెదడులో ఉన్న ఆరోమాటేస్ (Aromatase) మొత్తాన్ని అలాగే దాని స్థానాన్ని దృశ్యమానం చేయగలిగారు. ఒక మోతాదు మెదడు ఆధారిత అరోమాటేస్ స్థాయిని కొద్దిగా తగ్గించిందని పరిశోధకులు కనుగొన్నారు.

స్త్రీ పురుషులు నికోటిన్‌కు భిన్నంగా ప్రతిస్పందిస్తారని చాలా కాలంగా గుర్తించబడింది. స్త్రీలు NRT(నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీ)కి ఎక్కువ నిరోధకతను కలిగి ఉంటారు. వారు ధూమపానం మానేసేందుకు ప్రయత్నించినప్పుడు పురుషుల కంటే ఎక్కువగా తిరిగి మొదలెట్టే అవకాశం ఉంది. అయినప్పటికీ, ఈ వైవిధ్యాలకు ఏ జీవసంబంధమైన కారకాలు దారితీశాయో అస్పష్టంగా ఉంది. మానవుల్లో అరోమాటేస్ ఉత్పత్తి (Aromatase production) నిరోధించబడిన మొదటి ఉదాహరణ ఇది. అబ్బాయిలపై ఈ ప్రభావం పరిశోధించబడలేదు.

పురుషులతో పోలిస్తే మానేయడం కష్టమే..

‘ఈస్ట్రోజెన్ ఉత్పత్తిపై నికోటిన్ ప్రభావం మెదడుపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని ఈ ఆవిష్కరణ వెల్లడిస్తోంది. పునరుత్పత్తి వ్యవస్థ వంటి ఇతర విధులపైనా ఇది ప్రభావం చూపుతుందా? అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు (no clarity). స్త్రీ పురుషులు ధూమపానం పట్ల ప్రతిస్పందించే విధానంలో తేడాల విషయానికొస్తే.. స్త్రీలు నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీకి (Replacement therapy) ఎక్కువ నిరోధకత కలిగి ఉంటారు. అంటే వారు మరింత పునఃస్థితిని అనుభవిస్తారు. ధూమపానం అలవాటుతో వారసత్వంగా ఎక్కువ హాని చూపుతారు. ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండెపోటు (Lung cancer, heart attack) వంటి ప్రాధమిక ధూమపాన సంబంధిత అనారోగ్యాలను అభివృద్ధి చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. హార్మోన్ల వ్యవస్థపై నికోటిన్‌కు సంబంధించిన ఈ చర్య.. ఈ ప్రతిచర్యల్లో దేనిలోనైనా పాల్గొంటుందో లేదో మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి’ అని ప్రొఫెసర్ కోమాస్కో (Comasco)అన్నారు.

తదుపరి పరిశోధనకు కీలకం..

‘ఇది చాలా ముఖ్యమైన మొదటి అన్వేషణ. ధూమపానం స్త్రీ పురుషుల్లో చాలా ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంది. నికోటిన్ ప్రత్యేక ప్రభావం మహిళల్లో ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని తగ్గించడం గురించి ఇంతకు ముందు తెలియదు. కానీ పొగాకు వ్యసనం (Tobacco addiction)అనేది అనేక కారణాలతో కూడిన సంక్లిష్ట రుగ్మత అని గమనించాలి. థాలమస్ (ఈస్ట్రోజెన్ ఉత్పత్తి)పై నికోటిన్‌కు సంబంధించిన ఈ నిర్దిష్ట ప్రభావం.. మేల్, ఫిమేల్ స్మోకర్స్ మధ్య అభివృద్ధి దశ, చికిత్స, ఫలితాల్లో గమనించిన అన్ని తేడాలను వివరించే అవకాశం లేదు. ఇది ఫిమేల్ స్మోకర్స్‌లో ఈస్ట్రోజెన్ ఉత్పత్తి (Estrogen production in female smokers)లో నికోటిన్-ప్రేరిత తగ్గింపు నుంచి నికోటిన్ వ్యసన ప్రమాదంతో పాటు చికిత్స & పునఃస్థితిలో ప్రతికూల ప్రభావాలను తగ్గించే వరకు ఇంకా చాలాదూరంలో ఉంది. కానీ ఈ పని తదుపరి పరిశోధనకు అర్హమైనది.’ -విన్ వాన్ డెన్‌ బ్రింక్, ఎమెరిటస్ ప్రొఫెసర్ (Win van den Brink, Emeritus Professor) ఆమ్‌స్టర్‌డామ్ యూనివర్సిటీ అకడమిక్ మెడికల్ సెంటర్‌.

(Loneliness:‘ఒంటరితనం’ ధూమపానం కన్నా ప్రమాదమే..)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -