end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయంఈ రోజు పాముల దినోత్సవం...
- Advertisment -

ఈ రోజు పాముల దినోత్సవం…

- Advertisment -
- Advertisment -

పాముల దినోత్సవం రోజున కొన్ని నమ్మలేని నిజాలు తెల్సుసుకుందాం. పామును చూడగానే ఎవరు అయిన బయపడటం సహజం. విషపూరితమైన పాములు కాటేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి వాటిని చూడగానే బ్రెయిన్ నుంచి భయపడే సంకేతాలు వస్తాయి. అన్ని పాములూ ప్రమాదకరమైనవి కావు. కొన్ని సర్పాలకు విషం ఉండదు. దేనికి విషం ఉందో, దేనికి లేదో గుర్తించేందుకు కొన్ని సంకేతాలు ఉన్నాయి. ప్రపంచ పాముల దినోత్సవం సందర్భంగా ఈ పాకే జీవులకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. అలాగే కొన్ని నిజాలు చెప్పుకుందాం.

పాములకూ ఓ రోజును కేటాయించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ సృష్టిలో ప్రతీ జీవీ ముఖ్యమైనదే. ఏవి అంతరించిపోయినా ఆహార గొలుసు దెబ్బతింటుంది. పాములు అంతరించిపోతే భూమిపై పాములు అన్నవే లేకపోతే ఏమవుతుందో తెలుసా? కప్పల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. అవసరానికి మించి పెరుగుతాయి. అదే సమయంలో గద్దల లాంటి పాముల్ని తినే పక్షులకు ఆహార కొరత ఏర్పడుతుంది. అందువల్ల వాటి సంఖ్య తగ్గిపోతుంది. ఇలా ఆహార గొలుసు దెబ్బతింటుంది. పైగా ఈ పాముల విషాలతో రకరకాల మందులు తయారుచేస్తున్నారు. పాములపై ఆధారపడి చాలా మంది జీవిస్తున్నారు. అందుకే పాములు మనకు అత్యంత అవసరమైనవి. మన భారతదేశంలోనైతే వాటిని దైవ సమానంగా చూస్తాం. పూజలు చేస్తాం. అదీ సర్పాలకు మన భారతీయులు ఇచ్చే విలువ. ఇక విదేశీ పురాణాల్లో ఆదాం, ఏవ యాపిల్ తినడానికి కారణం ఓ పాము అనే కథ ఉంటుంది. అలా పామును మనుషులకు శత్రువుగా చూపించారు. నిజానికి పాములు మనుషులకు మేలు చేస్తున్నాయి. అవి తమ ప్రాణ రక్షణ కోసమే కాటు వేస్తాయి తప్ప పనిగట్టుకొని ఎవర్నీ కాటు వెయ్యవు.

పాములలో ఉన్న జాతులు, రకాలు, వాటి స్వభావం, లక్షణాల గురిచి ప్రజలకూ, విద్యార్థులకూ అవగాహన కలిగించేందుకు ఏటా జులై 16న ఈ సర్పాల దినోత్సవాన్ని జరుపుతున్నారు. ప్రపంచంలో 3,789 జాతుల పాములున్నాయని అంచనా. వీటిలో 600 రకాల పాములకు విషం ఉంది. మొత్తం జాతుల్లో ఇవి 25 శాతం కంటే తక్కువ. వీటిలో కూడా మనుషులపై దాడి చేస్తున్నవి 200 జాతుల పాములే. అందువల్ల పాముల్ని చూసి మనం ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇప్పుడు ఉన్న పాముల జాతులలో చాలావరకూ డైనోసార్లతో జీవించినవి ఉన్నాయి. అంటే పాములు మనుషుల కంటే ముందే పుట్టాయి.

పాముల్లో అత్యంత విషపూరితమైనది కింగ్ కోబ్రా. ఈ నాగుపాము పడగ విప్పగలదు. బుసకొట్టి కాటు వెయ్యగలదు. ఈ పాములతో జాగ్రత్తగా ఉండాలి. వీటి జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. పాముల్లో రాటిల్ స్నేక్ చాలా తీవ్రతను కలిగివుంటుంది. మనుషుల్ని ఎక్కువగా కాటువేస్తున్న వాటిలో ఇది ఉంది. ఇక రెట్రిక్యులేటెడ్ పైథాన్ అని పిలిచే ప్రపంచంలోనే అతి పొడవైన కొండచిలువలు. ఏ జీవినైనా బలంగా చుట్టి ఎముకలు విరగ్గొట్టి మింగేస్తాయి. లక్కీగా ఇవి మనుషుల జోలికి రావట్లేదు. ప్రస్తుతం పాములన్నీ అంతరించిపోయే జీవుల జాబితాలోనే ఉన్నాయి. కారణం అవి జీవించే అడవులు, తినే ఆహారం తగ్గిపోవడమే.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -