end

అక్షరాల రూ.44 లక్షల వేతనం

snehakiran-amazonjob
sneha kiran got software engineer job in amazon india with 44 lakhs pacakge

సంవత్సరానికి అక్షరాల రూ.44 లక్షల వేతనం. అదీకూడా ఇంకా చదువు పూర్తికాకముందే ప్రపంచంలోనే పెద్ద కంపెనీ అమెజాన్‌ సంస్థలో ఉద్యోగం ఎంపిక. ఎవరూ ఊహించిఉండరేమో. కష్టపడితే, ముఖ్యంగా చదువుపై, కెరీర్‌పై ఇష్టపడితే సాధించలేనిదంటూ ఏమి ఉండదూ అని ప్రతీ సారి ఎవరో ఒకరు రుజువు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలాసలో ఉండే స్నేహకిరణ్‌ అతి చిన్నవయసులోనే రూ.44 లక్షల వార్షిక వేతనం అందుకోబోతుంది. స్నేహకిరణ్‌ ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతుంది.

తండ్రి సింహాచలం పలాసలో ఉండే జీడిపప్పు కర్మాగారంలో పని చేస్తుండగా, తల్లి సుభాషిణి గృహిణి. స్నేహకిరణ్‌ కోవిడ్‌ సమయంలో తన సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకొని ఆన్‌లైన్‌ ద్వారా ప్రోగ్రామింగ్‌, కోడింగ్‌ కోర్సులు నేర్చుకుంది. ఇదేగాకుండా తన స్నేహితులతో డిస్కస్‌ చేస్తూ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను పెంచుకుంది. క్యాంపస్‌ ఇంటర్వ్యూలో అమెజాన్‌ సంస్థకు ఎంపికైంది. ఇష్టపడి చదివితే ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందడం అంతకష్టమేమికాదని స్నేహకిరణ్‌ రుజువు చేసింది.

Exit mobile version