end
=
Tuesday, September 17, 2024
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంGhee:నెయ్యితో ఎన్ని లాభాలో..
- Advertisment -

Ghee:నెయ్యితో ఎన్ని లాభాలో..

- Advertisment -
- Advertisment -

నెయ్యి.. ఇది నాచురల్‌గా లభించే ఓ దివ్య ఔషధం(Divine medicine) అని చెప్పవచ్చు. తరచూ ఆహార పదార్థాల్లో వాడే నెయ్యిని, శరీర సౌందర్యానికి కూడా ఉపయోగించవచ్చు అంటున్నారు బ్యూటీషియన్స్‌(Beauticians). ఎన్నో రకాల వెరైటీ ఆహార పదార్థాల తయారీకి నెయ్యి కావాల్సిందే. చలికాలం వేళ పెదవులు పగుళ్లు రావడం, చర్మం పొడిబారడం సాధారణం. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే మీరు ఖచ్చితంగా నెయ్యిని ఉపయోగించించాల్సిందే.

  • కొద్దిగా నెయ్యిని పచ్చి పాలు, సెనగపిండిలో వేసి పేస్ట్‌ తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్‌ను చర్మానికి రాసుకొని నెమ్మదిగా మసాజ్‌(Massage) చేసుకోవాలి. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్‌ప్యాక్‌(Face Pack)ను తరచూ వాడితే చర్మానికి తేమ అందుతుంది. నిగారింపు కూడా సొంతమవుతుంది.
  • పొడిబారిన, పగుళ్ళు ఏర్పడిన పెదవుల(Lips)కు నెయ్యి చక్కగా పనిచేస్తుంది. రాత్రిపూట నిద్రపోయే ముందు పెదవులకు నెయ్యి రాసుకొని, మర్ధన చేయాలి. ఉదయాన్నే నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే పెదవులు పొడిబారడం తగ్గిపోతుంది.
  • తేమ, పోషణ అందకపోవడం వల్ల కురులు(Hair) నిర్జీవంగా కనిపిస్తాయి. టేబుల్‌స్పూన్‌ నెయ్యిని వేడిచేసి చల్లార్చాలి. తరువాత ఆ నెయ్యిని జుట్టుకు పట్టించాలి. రెండు గంటలు అలానే ఉండాలి. తరువాత షాంపూతో తలంటుకుంటే కేశాలు జీవాన్ని పొంది పట్టులా మెరుస్తాయి.
  • కొంచెం నెయ్యి తీసుకొని, చర్మాని(Skin)కి మసాజ్‌ చేస్తున్నట్టుగా రాసుకోవాలి. కొద్దిసేపు అలానే ఉండి తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. నెయ్యిలో చర్మాన్ని యవ్వనం(Young)గా కనిపించేలా చేసే గుణాలున్నాయి. ఇవి వయసుతో వచ్చే ముడతల(wrinkles)ను తగ్గించి, చర్మాన్ని బిగుతుగా మారుస్తాయి.

(Constipation:మలబద్దకం ఉన్న వాళ్లు ఈ టిప్స్‌ పాటిస్తే సరి..)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -