end

ఐపీఎల్‌లో ‘సాఫ్ట్‌ సిగ్నల్‌’ లేదు

  • బీసీసీఐ కీలక నిర్ణయం

టీం ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కొహ్లీ అభ్యర్థన మేరకు ఐపీఎల్‌ 14వ సీజన్‌ క్రికెట్‌లో ఫీల్డ్‌ అంపైర్‌ ‘సాఫ్ట్‌ సిగ్నల్‌’ విధానాన్ని బీసీసీఐ తొలగించింది. క్రికెట్‌ ఆటలో ఎవరైనా అవుట్‌ అయినప్పుడు స్టేడియంలో ఉన్న ఫీల్డ్‌ అంపైర్‌ తన నిర్ణయాన్ని మూడో అంపైర్‌కు సిఫారసు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ విధానం రద్దు చేస్తునట్లు బీసీసీఐ వెల్లడించింది.

అయితే ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్‌ క్యాచ్‌ను డేవిడ్ మలన్‌ సరిగ్గా అందిపట్టుకున్నాడా? లేదా అనే విషయం పలు అనుమానాలు వ్యక్తమవుతున్న సందర్భంలో ఫీల్డ్‌ అంపైర్‌ అవుట్‌ అని సాఫ్ట్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. అయితే మూడో అంపైర్‌ కూడా దాన్ని పరిగణలోకి తీసుకొని సూర్యను అవుట్‌గా ప్రకటించాడు. ఈ విషయంలో టీంఇండియా కెప్టెన్‌ విరాట్‌కొహ్లీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ సాఫ్ట్‌ సిగ్నల్‌ విధానాన్ని వ్యతిరేకించాడు. ఈ విధానాన్ని తొలగించాలని అన్నాడు. దీనికితోడు క్రికెట్‌ మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ కూడా సాఫ్ట్‌ సిగ్నల్‌ తొలగించాలని చెప్పాడు.

అయితే బీసీసీఐ కొహ్లీ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని వచ్చే ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఈ సాఫ్ట్‌ సిగ్నల్‌ విధానాన్ని అమలు చేయబోమని, కేవలం మూడో అంపైర్‌ నిర్ణయం మాత్రమే చెల్లుతుందని తెలిపారు.

Exit mobile version