end
=
Sunday, January 19, 2025
క్రీడలురేసులో నిలిచేదెవరో..
- Advertisment -

రేసులో నిలిచేదెవరో..

- Advertisment -
- Advertisment -
  • టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌
  • గత మ్యాచ్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్న వార్నర్‌ సేన
    ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఇవాళ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్ రాయల్స్‌ జట్లు తలపడనున్నాయి. ఇరు జట్లు పోటీపడిన గత లీగ్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌ జట్టు.. ఎస్‌ఆర్‌హెచ్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. అయితే ఇవాళ మ్యాచ్‌ గెలిచి, లెక్క సరిచేయాలని హైదరబాద్‌ జట్టు భావిస్తోంది. ఇప్పటివరకు ఐపీఎల్‌ చరిత్రలో రెండు జట్లు 12 సార్లు తలపడగా.. చెరో ఆరు మ్యాచుల్లో విజయం సాధించాయి. ఇప్పటివరకు లీగ్‌ దశలో 10 మ్యాచులాడిన రాజస్థాన్‌ జట్టు 4 విజయాలు సాధించి, 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్‌ జట్టు 9 మ్యాచులాడి 3 మ్యాచుల్లో నెగ్గి, 7వ స్థానంలో కొనసాగుతోంది. హైదరాబాద్‌ జట్టుకు నెట్‌రన్‌రేట్‌ బాగుండడంతో, ఆ జట్టు ఇవాళ గెలిస్తే, ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉంటాయి. కాగా, రెండు జట్లకు ఆస్ట్రేలియన్లే కెప్టెన్‌లుగా ఉండడం గమనర్హం.
  • జట్ల వివరాలుః
  • హైదరాబాద్‌ జట్టుః డేవిడ్‌ వార్నర్(కెప్టెన్‌)‌, జానీ బెయిర్‌ స్టో(వికెట్ కీపర్‌), ప్రియం గార్గ్‌, మానిష్‌ పాండే, విజయ్‌ శంకర్‌, అబ్దుల్‌ సమద్‌, జేసన్‌ హోల్డర్‌, రషీద్‌ ఖాన్‌, నదీమ్‌, సందీప్‌ శర్మ, నటరాజన్‌.
  • రాజస్థాన్‌ జట్టుః బెన్‌ స్టోక్స్‌, రాబిన్ ఉతప్ప, సంజూ సాంసన్(వికెట్‌ కీపర్), స్టీవెన్ స్మిత్(కెప్టెన్‌), జోస్‌ బట్లర్‌, రియాన్‌ పరాగ్‌, రాహుల్‌ తెవాటియా, జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్‌ అయ్యర్‌, అంకిత్‌ రాజ్‌పుత్‌, కార్తిక్ త్యాగి.
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -