end
=
Monday, January 20, 2025
సినీమాఅభాగ్యుల ఆకలి తీర్చుటకు ఆస్తులు తనఖా పెట్టిన సోనూ..
- Advertisment -

అభాగ్యుల ఆకలి తీర్చుటకు ఆస్తులు తనఖా పెట్టిన సోనూ..

- Advertisment -
- Advertisment -

కోవిడ్‌ సమయంలో ఎంతో మంది అభాగ్యులకు సాయం అందించి రియల్‌ హీరో అనిపించుకున్న వ్యక్తి సోనూసూద్‌. ఇప్పటికీ ఎంతో మందికి సాయాన్ని అందిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అయితే ఆపదలో ఉన్నవారికి సాయం అందించడానికి సోనూసూద్‌కు డబ్బులు ఎలా వస్తున్నాయి? అని అనుకున్నవాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. అయితే అలాంటి వారి ప్రశ్నలకు సమాధానం దొరికింది. మన దగ్గర ఉంటే ఇవ్వడానికి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాం. కానీ సోనూసూద్‌ అలా అనుకోలేదు. ఆపదలోని వారికి సాయం చేయాలనుకోగానే తన చేతిలోని డబ్బులు అయిపోయినా ముంబై జూహూలోని తన ఆస్తులను తనఖా పెట్టి రూ.10 కోట్లు అప్పు తీసుకుని.. ఆ డబ్బుతోనే అందరికీ సాయం అందిస్తూ వచ్చారు సోనూసూద్. ఒప్పందం సెప్టెంబర్ 15 న సంతకం చేయబడిందని. నవంబర్ 24 న నమోదు చేయబడిందని, రుణం పెంచడానికి 5 లక్షల రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారని సమాచారం.

దీని గురించి జెఎల్‌ఎల్ ఇండియా రెసిడెన్షియల్ సర్వీసెస్ సీనియర్ డైరెక్టర్, హెడ్ రితేష్ మెహతా మాట్లాడుతూ.. ఆస్తులన్నీ సోనూ సూద్, అతని భార్య పేరుపైనే ఉన్నాయి. దీనికి సంబంధించిన రెంటల్‌ కూడా వారు అందుకుంటున్నారు. తనఖా తర్వాత రూ.10 కోట్లకు వడ్డీ, అసలు చెల్లించాల్సి ఉంది” అన్నారు. అయితే దీనిపై ఇంత వరకు సోనూ సూద్‌ స్పందించలేదు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -