end
=
Friday, September 20, 2024
సినీమామరోసారి దాతృత్వాన్ని చాటిన సోనూ..
- Advertisment -

మరోసారి దాతృత్వాన్ని చాటిన సోనూ..

- Advertisment -
- Advertisment -
  • టీ ఆర్ కే ట్రస్ట్ పిలుపుకు స్పందించిన నటుడు సోనూసూద్
  • బాలుడి వైద్యం కోసం అయ్యే 7 లక్షలు తానే ఇవ్వనున్నట్లు ట్విట్టర్ లో ప్రకటన
  • శస్త్రచికిత్స కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన రియల్‌ హీరో

వేములవాడ: చలనచిత్ర రంగంలో అతనొక విలక్షణమైన నటుడు. తను సినిమాల్లో వేసేవన్నీ విలన్‌ వేశాలే. కానీ, నిజ జీవితంలో మాత్రం హీరో. ఆపదలో ఉన్న ఎందరో అభాగ్యులకు తనవంతు సహాయమందిస్తూ గొప్ప పేరు తెచ్చుకున్న మంచి మనసున్న మనిషి. ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా పరిచయం అక్కర్లేని ఏకైక వ్యక్తి సోనూసూద్. ఎవరైనా ఆపదలో ఉంటే.. వెంటనే తన దాతృత్వాన్ని చాటుతున్నారు. నిత్యం ప్రజలకు సేవలు చేస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు సోనూ.

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం జగ్గారావుపల్లి గ్రామానికి చెందిన పందిపల్లి బాబు-రజిత దంపతుల నాలుగు నెలల కుమారుడు అద్విత్‌ శౌర్య పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యుల సూచనల మేరకు బాలుని గుండెకు అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాలని తెలిపారు. వైద్యం కోసం దాదాపు 7లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో అసలే నిరుపేదలైన బాలుడి తల్లిదండ్రులు సహాయం చేయాలని టి.ఆర్.కె ట్రస్ట్ నిర్వాహకులను కోరారు.వెంటనే స్పందించిన ట్రస్ట్ సభ్యులు బాధితుల వీడియోను తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి.. దాతలు సహాయం అందించి బాలుడి ప్రాణాలను కాపాడాలని విన్నవించారు. టి ఆర్ కె ట్రస్ట్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్నేహితులు ట్విట్టర్‌లో బాలుడి పరిస్థితి గురించి ప్రముఖ సినీ నటుడు సోనూసూద్‌ కు తెలియజేసి సహాయం అందించాలని కోరారు. వెంటనే స్పందించిన సోను భాయ్ బాలుడి వైద్యం కోసం అయ్యే 7 లక్షలు తానే ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

ఈ మేరకు గురువారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ప్రవేట్ ఆసుపత్రిలో బాబు శస్త్రచికిత్స కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాధితులకు అండగా నిలిచిన టి ఆర్ కే ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్ ఆదేశాల మేరకు ట్రస్ట్ డైరెక్టర్ మొట్టల మహేష్ కుమార్, వర్కింగ్ టీం, ఎంక్వయిరీ, ఆఫీస్ టీం సభ్యుల సహకారంతో బాలుడితో పాటు వారి తల్లిదండ్రులు హైదరాబాద్ వెళ్లడానికి ఒక వాహనాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ట్రస్ట్ డైరెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ.. బాలుడి ప్రాణాలు కాపాడటం కోసం అన్నివిధాలుగా సహాయసహకారాలు అందించిన సినీ నటుడు సోనూసూద్ తో పాటు దయా హృదయులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. టి.ఆర్.కె ట్రస్ట్ సహకారంతో ఇప్పటివరకు దాదాపు 1 లక్ష 46 వేల ఆర్థిక సహాయం అందిందని ఆయనవెల్లడించారు.

బాలుడి శస్త్రచికిత్స కోసం అయ్యే 7 లక్షలు సోనూసూద్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మంచి మనసుతో తాము చేసిన పనికి దాతల సహకారంతో నాలుగు నెలల పసికందు అద్విత్ శౌర్య కు దేవుడు ఆశీర్వాదాలు అందజేశారన్నారు. బాబు ఆపరేషన్ పూర్తిచేసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారిని మనస్ఫూర్తిగా వేడుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో టి ఆర్ కె ట్రస్ట్ వర్కింగ్ టీం సభ్యులు, జగ్గారావు పల్లి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -