end
=
Thursday, January 23, 2025
సినీమామరోసారి తన సింప్లిసిటీని చాటిన సోనూ..
- Advertisment -

మరోసారి తన సింప్లిసిటీని చాటిన సోనూ..

- Advertisment -
- Advertisment -

సామాజిక మాధ్యమాల్లో పేదల ఇబ్బందులు చూసి ఆపద్బాంధవుడిగా స్పందించే సినీ నటుడు సోనూసూద్‌ ఓ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటన్‌ను సందర్శించారు. స్వయంగా ఫాస్ట్‌ఫుడ్‌ తయారు చేసి సందడి చేశారు. ఈ సంఘటన బేగంపేటలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బేగంపేటలో అనిల్‌ కుమార్‌ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ను నడుపుతున్నారు. సోనూసూద్‌ ప్రజలకు సహాయం చేస్తున్నాడని తెలుసుకుని తన సెంటర్‌కు ‘లక్ష్మి సోనూసూద్‌’ అని పేరు పెట్టాడు. అప్పటి నుంచి వ్యాపారం బాగా పెరగడంతో విషయాన్ని ట్విటర్‌లో పోస్టు చేశాడు. ఆ సమాచారం సోనూసూద్‌ వరకూ వెళ్లింది. దీనికి స్పందించిన సోనూ ఒక రోజు ‘మీ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ను సందర్శిస్తాను’ అని అనిల్‌కు సమాచారం అందించారు.

ఎవరూ ఊహించని విధంగా క్రిస్మస్‌ పండుగరోజు సోనూసూద్‌ అక్కడకు రావడంతో అనిల్‌ ఆశ్చర్యపోయారు. రావడమే కాదు.. స్వయంగా గరిట చేపట్టి ఫాస్ట్‌ఫుడ్‌ తయారుచేశారు. ఎగ్‌ ఫ్రైడ్‌రైస్‌ను రుచి చూసి బాగుందని కితాబిచ్చాడు. ‘ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కు నా పేరు పెట్టుకోవడం ఆనందంగా ఉంది. వ్యాపారం బాగా వృద్ధి చెందాలని ఆశిస్తున్నా’ అని అనిల్‌ను ఆశీర్వదించారు. సోనూసూద్‌ పేరు, ఫొటో పెట్టుకోవడం కలిసొచ్చిందని, స్వయంగా ఆయనే రావడం మరచిపోలేని అనుభూతినిచ్చిందని అనిల్‌ ఉబ్బితబ్బిబయ్యాడు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -