end
=
Sunday, January 19, 2025
సినీమాMovie: త్వరలో వంటలక్క ఎంట్రీ వెండితెర పై
- Advertisment -

Movie: త్వరలో వంటలక్క ఎంట్రీ వెండితెర పై

- Advertisment -
- Advertisment -

నాగ చైతన్య థాంక్యూ(Thank You) మూవీ పరాజయం తర్వాత ఒక విభిన్న కథ తో మన ముందుకు రాబోతున్నారు. చైతు ప్రస్తుతం తమిళ క్రేజీ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటిస్తున్నాడు. హీరో శింబుతో “మానాడు” చిత్రాన్ని తెరకెక్కించిన వెంకట్ ప్రభు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అదే చిత్రాన్ని రీమేక్(Remake) చేస్తూ సరికొత్త మార్పులు చేశారని ఈ మూవీపై భారీ అంచానాలు పెట్టుకున్నారు.  ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్(Thriller) చిత్రం గా ఉంటుంది. ఈ చిత్రానికి NC22 అనేది వర్కింగ్ టైటిల్ ని ఖరారు చేశారు. చిత్ర యూనిట్ ఈ రోజు నటీనటుల వివరాలు అందించారు. క్రేజీ నటి నటులు నాగ చైతన్య చిత్రంలో నటించబోతున్నారు.

(Chest Cancer:రొమ్ము క్యాన్సర్‌ వచ్చినాకే ఆ విషయం తెలిసింది..)

ఊహించని రీతిలో అందరికీ షాక్ ఇస్తూ ఈ చిత్రంలో బుల్లితెర వంటలక్క ప్రేమి విశ్వనాథ్ అవకాశాన్ని చేజిక్కించుకుంది. వంటలక్క కి ఒక రేంజ్ లో స్వాగతం పలికారు. టెలివిజన్ క్వీన్ కి స్వాగతం అంటూ చిత్ర యూనిట్ ప్రేమి విశ్వనాధ్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. కార్తీక దీపం(Karthika Deepam) టెలివిజన్ సీరియల్ తో వంటలక్కగా ప్రేమి విశ్వనాధ్ చేసిన సంచలనాలు తెలిసినవే. అద్భుతంగా హావభావాలు పలికిస్తూ, ఎమోషనల్ సీన్స్(Emotional Scenes) ఆశ్చర్యపరిచే విధంగా నటిస్తూ ఇప్పటివరకు బుల్లితెరపై తన సత్తా చాటి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. నాగ చైతన్య చిత్రంలో అవకాశం దొరకడం ఆమెకి లక్కీ ఛాన్స్(Lucky Chance) అనే చెప్పొచ్చు. ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటుందో చూడాలి. అలాగే నేషనల్ అవార్డు విన్నింగ్ నటి ప్రియమణి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆమె పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఒక్కొక్కరి పోస్టర్ రిలీజ్ చేస్తూ ఈ చిత్రంలో నటీనటుల వివరాలు తెలిపారు. హీరోయిన్ గా మైమరపించిన ప్రియమణి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ న్యూ మూవీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. 

ఇలా పోస్టర్ రిలీజ్ చేస్తూ నటీనటులని సంతోషాపరిచారు.ఇక ఈ చిత్రంలో తమిళ నటుడు అమరన్, తెలుగు హాస్య నటుడు వెన్నెల కిషోర్ కూడా నటిస్తున్నారు.  విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సంపత్ రాజ్ ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. శరత్ కుమార్ కూడా ఒక పాత్రలో నటిస్తున్నారు.  దృవ(Dhruva) మూవీ లో విలన్ గా చేసిన అరవింద్ స్వామి ఈ చిత్రంలో కూడా ప్రధాన విలన్ గా నటిస్తుండడం మరో విశేషం. ఇలా ప్రణాళిక ప్రకారం ఈ చిత్రంలో నటీనటుల్ని రివీల్ చేశారు. దీనితో ప్రారంభం నుంచే నాగచైతన్య మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి.

 

(Pooja Hegde New Hot Photos)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -