end

రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

  • కరోనా వైరస్‌ వ్యాప్తి వల్ల ప్రయాణీకులు కరువు

డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులు ప్రమోట్‌ !

దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావాలంటే జంకుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదోరకంగా వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. ప్రజలు ప్రయాణాలు మానేసుకున్నారు. ఎక్కడివారి అక్కడే ఉండిపోతున్నారు. దీంతో ప్రజా రవాణా వ్యవస్థ కూడా కొన్ని రోజుల పాటు ఆపివేసే పరిస్థితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే దక్షిణ మధ్య రైల్వే పలు మార్గాల్లో రైళ్లను రద్దు చేసింది. ప్రయాణీకులు లేక రైళ్లన్నీ ఖాళీగా కనబడుతున్నాయి. దీంతో నిర్వహణ ఖర్చు వృధా అవుతోంది. చాలా మంది ప్రయాణీకులు రైలు టిక్కెట్లు రద్దు చేసుకుంటున్నారు.

ఆర్టీసీ బస్సు భీభత్సం… మహిళ మృతి

ఏప్రిల్‌ 28 నుండి మే 31 వరకు నరసాపురం – నిడదవోలు, నిడదవోలు-నరసాపురం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇవేగాకుండా సికింద్రాబాద్‌ – బీదర్‌, బీదర్‌-హైదరాబాద్‌ రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఇంకా కొన్ని రూట్లలో కూడా రైళ్లు రద్దయ్యాయి. సికింద్రాబాద్‌-కర్నూలు, కర్నూలు-సికింద్రాబాద్‌, మైసూరు – రేణిగుంట, రేణిగుంట – మైసూరు, సికింద్రాబాద్‌ – ముంబై రైళ్లు రద్దైనట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

నాలుగైదు రోజుల్లో తెలంగాణలో వర్షాలు

Exit mobile version