- ఆహారం తీసుకుంటున్న బాలసుబ్రహ్మణ్యం
కరోనా వైరస్ సోకి ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నై ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే బాలు ఆరోగ్యం కుదుటపడుతుందని, చాలా మేరకు కోలుకున్నారని బాలు కుమారుడు ఎస్పీ చరణ్ వీడియో ద్వారా తన తండ్రి ఆరోగ్య పరిస్థితులను షేర్ చేసుకున్నాడు. శుక్రవారం నుండి బాలు ఆహారం తీసుకుంటున్నారని, 20 నిమిషాల పాటు డాక్టర్ల సహాయంతో లేచి కూర్చుంటున్నారని తెలిపారు.
ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు; మగ్గురు మృతి
అయితే బాలుకి ఇంకా ఎక్మో, వెంటిలేటర్ సాయంతో డాక్టర్లు చికిత్స కొనసాగిస్తున్నారని వివరించారు. ఇతర ఇన్‌ఫక్షన్లు తగ్గాయని, అయితే ఆయన ఊపిరితిత్తుల పనితీరు ఇంకా మెరుగుపడాల్సి ఉందని ఎస్పీ చరణ్ తెలిపారు. తన తండ్రి బాలు ఆరోగ్యం కోసం ఎంజీఎం ఆసుపత్రి డాక్టర్లు, నర్సులు, సిబ్బంది చాలా కష్టపడుతున్నారని, వారి సహాయం ఎన్నటికీ మరిచిపోలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే బాలు ఆరోగ్యం పూర్తిగా కుదుటపడుతుందని తెలిపారు.
తన తండ్రి కోసం అభిమానులు, బంధువులు, శ్రేయోభిలాషులు చేస్తున్న ప్రార్థనలు ఫలిస్తున్నాయని, అందుకు అందిరికీ కృతజ్ఞతలు తెలిపారు.
సెల్ఫీఫోటో దిగబోయి వాగులో గల్లంతు…