- రూమర్లు పుట్టించవద్దని తనయుడు ఎస్పీ చరణ్ వీడియో సందేశం
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా సోకి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న విషయం అందిరికీ విధితమే. అయితే తన తండ్రి బాలుపై వస్తున్న వదంతులను నమ్మవద్దని తనయుడు ఎస్పీ చరణ్ ఓ విడియో ద్వారా తెలిపారు. బాలసుబ్రహ్మణ్యంను ఎంజీఎం డాక్టర్లు వెంటిలేటర్‌పై నుండి తీసేశారని సోషల్ మీడియాలో వార్త వ్యాప్తిచెందుతుంది. అయితే ఇది అబద్దమని తన తండ్రి బాలు ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నారని చరణ్ స్పష్టం చేశారు. ఎంజీఎం డాక్టర్లు నిత్యం బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. అభిమానులు, ప్రజలు, శ్రేయోభిలాషులు చేస్తున్న ప్రార్థనలు, ఆకాంక్షలు కోరుకుంటున్నట్లుగానే ఆయన ఆరోగ్య పరిస్థితి తొందరలోనే కుదుట పడుతుందని వీడియో ద్వారా తెలిపారు.
( ఐసీయూలో గాయకుడు బాలసుబ్రహ్మణ్యం)