end
=
Sunday, January 19, 2025
వార్తలుఅంతర్జాతీయంఒబామా పుస్తకానికి విశేష స్పందన
- Advertisment -

ఒబామా పుస్తకానికి విశేష స్పందన

- Advertisment -
- Advertisment -

అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్‌ ఒబామా రాసిన పుస్తకానికి విశేష ఆదరణ లభిస్తోంది. ఆయన రాసిన ‘ఏ ప్రామిస్డ్‌ ల్యాండ్‌’ పుస్తకం అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తోంది. మఖ్యంగా కెనడా, అమెరికా దేశాల్లో ఈ పుస్తకం విపరీతంగా అమ్ముడవుతోంది. పుస్తకం రిలీజైన 24 గంటల్లోనే దాదాపు 8.9 లక్షల కాపీలు అమ్ముడుపోయాయంటే నమ్మండి. ప్రి ఆర్డర్లు, ఈ-బుక్‌, ఆడియో సహా జరిగిన తొలి రోజు విక్రయాల్లో పెంగ్విన్‌ ర్యాండమ్‌ సంస్థకు ఇదో రికార్డు. ఈ పుస్తకం పాఠకులు ఎంతగా ఎదురు చూశారో దీన్ని బట్టి అర్థమవుతోందని సంస్థ తెలిపింది.

కాగా, ఒబామా అమెరికా అధ్యక్షుడిగా డెమోక్రటిక్‌ పార్టీ నుంచి వరుసగా రెండు గెలుపొందారు. అనంతరం, ఆ పార్టీ నుంచి పోటీ చేసిన హిల్లరీ క్లింటన్‌.. ట్రంప్‌ చేతిలో ఓటమిపాలయ్యారు. మళ్లీ ఇటీవల జరిగిన యూఎస్‌ ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించడం విశేషం. ఈ పుస్తకంలో ఒబామా.. తన అనుభవాలు, వైట్‌ హౌస్‌ విశేషాలు, వివిధ దేశాధినేతలతో, ముఖ్య నేతలతో ఎదురైన సంఘటనలు పంచుకున్నారు. ఇందులో భారత ప్రముఖుల గురించి కూడా ప్రస్తావించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -