end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయంTRS MLA Money Offer : ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డికి ప్రత్యేక భద్రత
- Advertisment -

TRS MLA Money Offer : ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డికి ప్రత్యేక భద్రత

- Advertisment -
- Advertisment -
  • ఎస్కార్ట్‌ వాహనం, 4+4 అంచెల భద్రత, పికెట్‌ ఏర్పాటు

తెలంగాణలో సంచలనం సృషిస్తున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు(TRS MLA Purchase) కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ఆ నలుగురు ఎమ్మెల్యేలకు అదనపు భద్రతను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ‘టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు’ రహస్య ఆపరేషన్‌ కేసులో పైలట్‌ రోహిత్‌రెడ్డి(Pilot Rohith Reddy) కీలకమైన ఆధారాలు సేకరించి పార్టీ అధిష్టానానికి(TRS Party), పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గట్టి భద్రతను(Special Secuirity) పోలీసులు(TS Police) ఏర్పాటు చేశారు. రోహిత్‌రెడ్డికి ఎస్కార్ట్‌ వాహనం(Escort Vehicle), 4+4 అంచెల భద్రతను ప్రభుత్వం కల్పించింది. ఆయన ఇంటి వద్ద పోలీసులు పికెట్‌ను ఏర్పాటు చేశారు. అదనపు భద్రతలో భాగంగా ఆయనకు బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనాన్ని(Bulletprof vehicle) ఏర్పాటు చేశారు.

(Operation Farm House: సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ సైలెంట్‌ ?!)

అయితే ఈ కేసులో పోలీసులు కీలక ఆధారాలు(Key Evidence) సేకరించారు. తనను డబ్బులతో ప్రలోభపెట్టేందుకు నిందితులు ప్రయత్నిస్తున్నారని ముందుగానే పోలీసులకు రోహిత్‌రెడ్డి సమాచారం ఇచ్చారు. కాగా పోలీసులు రంగంలోకి దిగి స్టింగ్‌ ఆపరేషన్‌ (Sting Operation) నిర్వహించారు. రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో(Rohit Reddy Farm House) సీసీ కెమేరాలు( CC Camera), వాయిస్‌ రికార్డర్లను అమర్చారు. మూడు గంటలపాటు సాగిన సమావేశాన్ని రికార్డు చేసి పోలీసులు న్యాయస్థానానికి నివేదిక సమర్పించారు.

(Bharat Jodo Yatra:”భారత్ జోడో యాత్ర”లో తగ్గిన జోష్)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -