end

వేసవిలో ప్రత్యేక రైళ్లు

వేసవిలో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 104 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్యరైల్వే జోన్‌ అధికారులు తెలిపారు. సాధారణంగా వేసవిలో ప్రయాణీకుల రద్దీ పెరుగుతుంది. వేసవి విడిది, పాఠశాలలు, కళాశాలలకు సెలవులు కారణంగా దూర ప్రాంతాలకు ప్రయాణించేవారు ఎక్కువవుతారు. అందుకని స్పెషల్‌ రైళ్లను నడుపడానికి సిద్దమయ్యారు. ఇందులో వారానికోసారి 26 ప్రత్యేక రైళ్లు, మూడువారాలకొకసారి 78 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ఈ ప్రత్యేక రైళ్లు ఏప్రిల్‌ 1 నుండి ప్రారంభమవుతాయని వెల్లడించారు. సికింద్రాబాద్‌ నుండి ఎర్నాకులం వైపు 26 ప్రత్యేక రైళ్లు, మచిలీ పట్నం నుండి కర్నూల్‌ మధ్య 78 రైళ్లు నడుపుతామని తెలిపారు. టికెట్లు, రైళ్ల రాకపోకల సమయాలు, ఇతర వివరాల కోసం https://scr.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌లో చూడాలని జోనల్‌ అధికారులు వివరించారు.

Exit mobile version