పాపులర్ మ్యూజిక్ స్ట్రీమింగ్ కంపెనీ (music streaming company) స్పాటిఫై తమ సిబ్బందిలో 6శాతం మందిని తీసివేయనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేక్‍బుక్, అమెజాన్, ట్విట్టర్ (Google, Microsoft, Facebook, Amazon, Twitter)సహా చాలా కంపెనీలు వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకగా తాజాగా ఈ జాబితాలో స్పాటిఫై టెక్నాలజీ (Spotify Technology SA) కూడా చేరింది. ఆర్థిక మాంద్యం వస్తుందన్న అంచనాలతో అందుకు సిద్ధంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్వీడెన్‍కు (Sweden) చెందిన స్పాటిఫై వెల్లడించింది. స్పాటిఫైలో ప్రస్తుతం 9800 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులు ఉన్నారని, ఇందులో సుమారు 580 మందిని తొలగించబోతున్నట్లు నోటిసులు జారీచేసింది.
12 వేల మంది ఉద్యోగులను కంపెనీ నుంచి తొలగిస్తున్నట్టు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఇటీవల ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ కూడా 10వేల మంది ఎంప్లాయిస్‍ను తీసేసింది. ఫేస్‍బుక్ పేరెంట్ కంపెనీ మెటా, ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, ట్విట్టర్ (Meta, e-commerce giant Amazon, Twitter) ఇలా చాలా సంస్థలు వేలాది సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి, ఆర్థిక మాంద్యం భయాలు, ఆదాయం తగ్గడం, డిమాండ్ క్షీణతను ఉద్యోగుల తొలగింపునకు కారణాలుగా చూపుతున్నాయి సంస్థలు.