end
=
Friday, January 24, 2025
సినీమాMovie: ‘డీజే టిల్లు’కు షాకిచ్చిన శ్రీలీలా.. సెట్‌లో ఏం జరిగింది?
- Advertisment -

Movie: ‘డీజే టిల్లు’కు షాకిచ్చిన శ్రీలీలా.. సెట్‌లో ఏం జరిగింది?

- Advertisment -
- Advertisment -

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీలా (Sri Leela) ఆరంగేట్రం మూవీ ‘పెళ్లి సందడి’ (pelli sandadi)తోనే హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించింది. దీంతో వరుస ఆఫర్లతో దూసుకుపోతూ స్టార్ హీరోల సరసన నటిస్తుంది.  అయితే ఇటీవల సిద్దు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda) హీరోగా నటించిన ‘డీజే టిల్లు’ (DJ Tillu) సెకండ్ పార్ట్‌లో (second part) నటించబోతుందంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ మూవీనుంచి ఆమె తప్పుకున్నట్లు తెలుస్తోంది.

(Darling Adipurush: టీజర్ డేట్ ఫిక్స్ ..)

విమల్ కృష్ణ (vimal krishna) దర్శకత్వంలో కామెడీ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా మొదటిపార్ట్‌లో నేహా శెట్టి (Neha Shetty) హీరోయిన్‌గా నటించింది. సిద్దు టైమింగ్‌కు నేహా అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా సిద్దు తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ (Release) అయిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలవడంతో ప్రేక్షకులకు సీక్వెల్‌పై (sequel)ఆసక్తికి పెరిగింది. దీంతో సినిమా రిలీజ్ అవడం, మంచి టాక్ (talk) తెచ్చుకున్న వెంటనే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ (makers) క్లారిటీ ఇచ్చారు. అప్పటి నుంచి ఈ సినిమా సీక్వెల్ పై ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ (Interest) క్రియేట్ అయ్యింది. దీంతో ఈ సినిమా సీక్వెల్‌కు సర్వం సిద్ధం చేయగానే హీరోయిన్ చేంజ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.

‘డీజే టిల్లు’ సీక్వెల్‌లో నేహా శెట్టికి బదులు శ్రీలీలాను ఎంపిక చేశారని అప్పట్లో నిర్మాతలు (Producers)అధికారికంగా ప్రకటించకపోయినా.. అందరూ ఆమెనే నటిస్తోందని ఫిక్స్ (fix) అయ్యారు. ‘పెళ్లి సందడి’ సినిమాలో చలాకీ తనంతో ఆకట్టుకున్న ఈ అమ్మడు.. ఎనర్జిటిక్ పర్ఫామెన్స్‌తో మాస్ మహారాజ ‘రవితేజ’ (Raviteja) సినిమాలో చాన్స్ కొట్టేసింది. దీంతో యంగ్ బ్యూటీవైపే మెగ్గుచూపిన మేకర్స్‌కు శ్రీలీల షాక్ (Shock) ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మొదట ‘డీజే టిల్లు’ సీక్వెల్ చేయడానికి ఒప్పుకున్నా ఆమె సినిమానుంచి పూర్తిగా తప్పుకుందని, రెండు రోజులు చిత్రీకరణలో పాల్గొన్నట్లు కూడా సమాచారం. అయితే ఇందుకు కారణాలు ఏమిటో తెలియకపోగా మూవీ యూనిట్ లేదా హీరోయిన్ శ్రీలీలా ఈ ఇష్యూపై అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -