తిరుమల శ్రీవారితోపాటు అనుబంధ దేవాలయాలకు భక్తులు కానుకగా ఇచ్చిన వస్త్రాలను ఈనెల 22 నుంచి 24 వరకు ఈ వేలం(Auction) వేయనున్నట్లు టిటిడి వెల్లడించింది. ఆసక్తి కలవారు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్ కార్యలయం(TTD Marketing Office) లేదా Ph:0877-2264429 ఫోన్ నంబర్ లో సంప్రదించాలని తెలియపరిచారు.
మరిన్ని వివరాలకి
https://www.tirumala.org/ లేదా
https://www.konugolu.ap.gov.in/ లోనూ చూడొచ్చని పేర్కొంది.
చరిత్రలోనే తొలిసారిగా.. తిరుమల శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం(Huge Income)…
గతంలో ఎన్నడూ లేనివిధంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి(Venkateswara Swamy) వారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్న క్రమంలో స్వామి వారి ఉండి ఆదాయం ఎక్కువగా పెరిగింది. తిరుమల శ్రీవారికి రికార్డు(Record) స్థాయిలో హుండీ ఆదాయం చేరింది. మే నెలలో రికార్డు స్థాయిలో 130 కోట్ల రూపాయల(130 Crores) ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఒక్క నెలలోనే ఇంత భారీ స్థాయిలో ఆదాయం రావడం ఇదే మొదటిసారి(First time) అని ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. మే నెలకు సంబంధించి ఇరవై రెండు లక్షల అరవై రెండు వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు అని ఆయన వెల్లడించారు. కరోనా(Corona) ఇంకా తగ్గని కారణంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఎన్నడూ లేనివిధంగా చరిత్రలో తొలిసారి ఒక్క నెలలో స్వామి వారి హుండీ ఆదాయం 130. 29 కోట్ల రూపాయలుగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈసారి లడ్డూ(Laddu కొనుగోలు 1.86 కోట్ల రూపాయల మేర జరిగాయని ధర్మారెడ్డి తెలిపారు.