end
=
Saturday, October 5, 2024
వార్తలురాష్ట్రీయంఓటరు కేంద్రాల్లో సేదతీరుతున్న సిబ్బంది
- Advertisment -

ఓటరు కేంద్రాల్లో సేదతీరుతున్న సిబ్బంది

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్‌: బల్దియా ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది పరిస్థితి దారుణంగా ఉంది. మధ్యాహ్నం మూడు గంటల వరకూ కేవలం 25.35 పోలింగ్‌ శాతం మాత్రమే నమోదు కావడం గమనార్హం. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, పాతబస్తీ, తదితర ప్రాంతాల్లో ఓటర్లు ఓటు వేయడానికి ఆసక్తి చూపించడం లేదు. శివారు ప్రాంతాల్లోని ప్రజలకు ఉన్న ఆసక్తి ఐటీ ఉద్యోగులకు ఉండడం లేదు. పోలింగ్ బూత్‌లు ఖాళీగా కనిపిస్తున్నాయి. దీంతో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు లేక సిబ్బంది నిద్రపోయే పరిస్థితి ఏర్పడింది.

జీహెచ్ఎంసీలో ప్రతిసారి తక్కువ శాతం ఓటింగ్ నమోదవుతుంది. ఈసారి కూడా పోలింగ్ శాతం పెంచాలని అధికారులు విశ్వప్రయత్నాలు చేశారు, కాని ఈసారి కూడా పోలింగ్ మందకొడిగా జరగడంతో అధికారులు పెదవి విరుస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారాన్ని ఊదరగొట్టిన నాయకులు ఓటర్లను బూత్‌ల్లోకి రప్పించలేకపోయారని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని పోలింగ్ బూతుల్లో ఇప్పటి వరకూ ఓటర్లే రాలేదు. ఘన చర్రిత కలిగిన భాగ్యనగరానికి ఇలాంటి ఓటింగ్ సిగ్గుచేటు అని పలువురు రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -