end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంCrime News:అమ్మాయిలు జర అచి తూచి అడుగు వేయండి
- Advertisment -

Crime News:అమ్మాయిలు జర అచి తూచి అడుగు వేయండి

- Advertisment -
- Advertisment -

ఆ రోజుల్లో అమ్మాయి కి సంబంధం చూడాలి అంటే అటు ఏడు తారలు ఎటు ఏడు తారలు చూడాలి అనేవారు మన పెద్దలు. కానీ ఏ రోజుల్లో హాయిగా ఇంట్లో కూర్చోని ఆన్లైన్(Online) లో సంబంధాలు చూడటం వీడియొ కాల్స్ లో మాట్లాడటం వంటివి చేస్తున్నారు. అలా చేయడం వల్ల ఒక అమ్మాయి కొన్ని లక్షలు నష్టపోయింది. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా జాబ్‌ ల‌క్ష‌ల్లో జీతం ఫొటోలో చూస్తే అబ్బాయి అందంగానే ఉన్నాడు. ఈ వివ‌రాలు మ్యాట్రిమోనీ(Matrimony) సైట్లో చూస్తే అమ్మాయిల‌కు పెళ్లి సంబంధాలు వెతికే తల్లిదండ్రులు అలాంటి సంబంధం కావాలి అనుకుంటారు అని  ఓ సైబ‌ర్ నేర‌గాడు(Cyber criminal) మోసాలు సులభంగా చేస్తున్నాడు. మ్యాట్రిమోనీ సైట్ ద్వారా ప‌రిచ‌యం చేసుకొని చాట్ చేయడం ఆపై పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి ర‌క‌ర‌కాల రూపాల్లో వారినుంచి డ‌బ్బు వ‌సూలు చేసి ఆపై మోసం చేయ‌డం.. ఇదీ ఈ నేర‌గాడి క్రైమ్ ఐడియా.

ఇంత‌కీ ఇత‌ను మ్యాట్రిమోనీలో ప‌రిచ‌యం చేసిన ఫొటో అత‌నిది కాదు.. వేరేవల్ల ఫొటోను త‌న‌దిగా చూపించి ప‌రిచ‌యం చేసుకుంటున్నాడు. కొచ్చెర్ల శ్రీ‌కాంత్ (35) అనే పేరుతో త‌న‌ను ప‌రిచ‌యం పెంచుకొని అతను ఓ యువ‌తి వ‌ద్ద రూ.48 ల‌క్ష‌ల న‌గ‌దు ట్రాన్సఫర్ చేపించుకున్నాడు. తర్వాత అనుమానం వ‌చ్చిన యువ‌తి పోలీసుల‌కి చెప్పడం తో అత‌ని బాగోతం బ‌య‌ట‌ప‌డింది. అత‌ని పేరు కొచ్చెర్ల శ్రీ‌కాంత్ కాద‌ని అతని పేరు పొట్లూరి వంశీకృష్ణ అని పోలీసులు తేల్చారు. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్(Software engineer) ని అంటూ చెప్పిన‌దంతూ అబ‌ద్ధ‌మ‌ని పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డైంది. ఇత‌ని స్వ‌స్థ‌లం విజ‌య‌వాడ‌(Vijayawada)గా గుర్తించారు. నిందితుడి దగర నుండి రూ.38 ల‌క్ష‌లు రిక‌వ‌రీ చేయగలిగారు. గ‌తంలోనూ ఇత‌నిపై 8 కేసులున్నాయ‌ని పోలీసులు చెబుతున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు యువ‌తుల‌ను  మోస‌గించాడ‌ని పోలీసులు తెలిపారు. ఇలాంటి వ్య‌క్తుల విష‌యంలో అమ్మాయిలు, వారి త‌ల్లిదండ్రులు గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మద్దు అని చాలా అప్ర‌మ‌త్తంగా ఉండాలని వారు తెలియచేసారు. 

(స్పెషల్ ట్రైన్లు.. తేదీలు, టైమింగ్స్ ఇవే..)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -