ఐపీఎల్‌లో భాగంగా షార్జా వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్ ఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 177 పరుగులు చేసింది. ఓపెనర్ రాబిన్ ఉతప్ప(41 పరుగులు) సాధించాడు. ఉతప్ప, మరో ఓపెనర్ బెన్ స్టోక్స్ తొలి వికెట్కు 50 పరుగల భాగస్వామ్యం అందించారు. ఈ జోడీని ఆర్సీబీ బౌలర్ క్రిస్ మోరిస్ విడదీశాడు. స్టోక్స్‌ను ఔట్ చేసి తన జట్టుకు బ్రేక్ ఇచ్చాడు.
స్వమిత్వా స్కీమ్ లాంచ్ చేయనున్న మోదీ..
అనంతరం, బౌలింగ్‌లోకి వచ్చిన మిస్టరీ స్పిన్నర్ చాహల్.. ఉతప్ప, సంజూ శాంసన్(9) లను వరుస బంతుల్లో ఔట్ చేసి, బెంగళూరుకు డబుల్ ధమాకా ఇచ్చాడు. 69 పరుగులకు 3 కీలక వికెట్లు కోల్పోయిన దశలో కెప్టెన్ స్టీవ్ స్మిత్(57) అర్ధసెంచరీతో జట్టును ఆదుకున్నాడు. అతడికి రాహుల్ తెవాటియా చక్కటి తోడ్పాటునందించాడు. బెంగళూరు బౌలర్లలో క్రిస్ మోరిస్ 4, చాహల్ 2 తీశారు.