end
=
Sunday, November 24, 2024
వార్తలురాష్ట్రీయంవరదసాయం తక్షణమే నిలిపివేయండి
- Advertisment -

వరదసాయం తక్షణమే నిలిపివేయండి

- Advertisment -
- Advertisment -
  • ప్రభుత్వానికి ఈసీ షాక్

హైదరాబాద్: ఇటీవల వరదల్లో చిక్కుకున్న బాధితులకు ప్రభుత్వం కుటుంబానికి రూ. 10వేల చొప్పున అందజేస్తున్న విషయం తెలిసిందే. కాగా, గ్రేటర్‌ ఎన్నికల నగారా మోగడంతో సాయాన్ని తక్షణమే నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి తెలిపింది. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులోకి రావడంతో వరద సాయం పంపిణీతో పాటు రిజిస్ట్రేషన్లు కూడా నిలిపేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు పూర్తయ్యే వరకు వరద సాయాన్ని ఆపేయాలని, ఎన్నికల తర్వాత యథావిథిగా వరద సాయాన్ని కొనసాగించవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ ఆదేశాలతో వరద సాయానికి బ్రేక్ పడింది.

ఇటీవల నగరంలో కురిసిన భారీ వర్షానికి నగర వాసులందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల కాలనీలన్నీ మునిగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు తమ సర్వస్వాన్ని కోల్పోయారు. దీన్ని గమనంలోకి తీసుకున్న కేసీఆర్.. సహాయంగా బాధితులకు పది వేల రూపాయల చొప్పున అందించాలని నిర్ణయం తీసుకుంది. దీని కోసం 550 కోట్లను వరద సాయం పేరిట నిధులను విడుదల చేసింది. అయితే… ఈ పంపిణీలో భారీగా అవినీతి జరిగిందని, లబ్ధిదారులకు దక్కకుండా పక్కదారి పట్టాయని తీవ్ర విమర్శలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సర్కార్… దగ్గర్లో ఉన్న మీ సేవ లేదా ఈ సేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది.

దీంతో బాధితులు ఉదయం ఆరు గంటల నుంచే మీసేవా, ఈసేవ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఒక్కసారిగా ప్రజలు ఎగబడటంతో సర్వర్లు కూడా పనిచేయలేదు. ప్రజలు గుమిగూడటం, సర్వర్లు పనిచేయకపోవడం, ఎన్నికల కోడ్ కూడా అమలులో ఉన్న నేపథ్యంలో వరద సాయాన్ని నిలిపేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆదేశించింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -