- – జపాన్‌లో స్త్రీల రెయిన్ కోట్ దొంగలిస్తున్న వ్యక్తి
- – 13 ఏళ్లుగా ఇదే పనిలో ఉన్న యోషిడో యోడా
సాధారణంగా లైఫ్ సెటిల్ మెంట్ (settlement) కోసం కోట్లు కొల్లగొట్టే దొంగలను చూశాం కానీ ఇంత చీప్ (cheap) చోరుని గురించి వినడం ఇదే మొదటిసారి. కేవలం రెయిన్ కోట్ లో (Rain coat) అమ్మాయిలు సెక్సీ (Sexy)గా కనిపిస్తారని.. వాటిని చోరీ చేస్తున్న దొంగ 2009 నుంచి ఇదే పనిలో నిమగ్నమయ్యాడు. పోలీసులకు (police) చిక్కకుండా తిరుగుతూ ముచ్చెమటలు పట్టించాడు. అసలు ఈ చోరీల వెనుకున్న ఆంతర్యం తెలియక 13 ఏళ్లుగా తలలు పట్టుకున్న ఖాకీలకు ఎట్టకేలకు దొరికిన దొంగ.. దాదాపు రూ. 60 కోట్ల విలువైన రెయిన్ కోట్స్ తో పట్టుబడటం విశేషం.
51 ఏళ్ల యోషిడో యోడా (Yoshido Yoda)ఇటీవల జపాన్ (japan) లోని ఒసాకాలో అరెస్ట్ (arrest) అయ్యాడు. స్థానికంగా ‘రెయిన్‌కోట్ మ్యాన్’ గా ప్రసిద్ధి చెందిన ఈ రహస్య దొంగ గురించి పోలీసులు దశాబ్దం పాటుగా వెతుకుతూనే ఉన్నారు. ఓ వార్తాపత్రిక డెలివరీ మ్యాన్‌గా (delivery man)పనిచేసిన ఆయన.. వర్షంలో తడవకుండా రక్షించే ప్లాస్టిక్ లేదా వినైల్ పోంచోతో తయారైన ‘కప్పా’ అని పిలువబడే వస్త్రంపై మోజు పెంచుకున్నాడు. అప్పటి నుంచి ముఖ్యంగా అమ్మాయిల సైకిళ్లు (Bicycle) లేదా పార్క్ చేసిన సైకిళ్లలో ఉండే రెయిన్ కోట్స్ ను టార్గెట్ చేస్తూ చోరీలు చేయడం మొదలెట్టాడు.