Student Suicde : ఇంటర్ విద్యార్థిని ఉరి(Hanged) వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ కుల్సుంపుర (Kulsumpuram Police Station) పోలీస్‌స్టేషన్ పరిధిలోని భరత్‌నగర్‌లో బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని నవ్య (Student Navya) అకారణంగా ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ నవ్య తల్లిదండ్రులు మాత్రం తన కూతురు నవ్యపై క్షుద్రపూజలు(Black Magic) చేశారని అందుకే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. గిట్టని వారు తమ ఇంటి ముందు నిమ్మకాలయు(Lemons), దీపాలు (Lamps)పెట్టి క్షుద్రపూజలు చేశారని నవ్య తల్లిదండ్రులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు (investigating) చేస్తున్నారు.