end
=
Friday, September 20, 2024
వార్తలురాష్ట్రీయంఆన్‌లైన్ క్లాసులకు సెల్ ఫోన్ కొనలేదని..
- Advertisment -

ఆన్‌లైన్ క్లాసులకు సెల్ ఫోన్ కొనలేదని..

- Advertisment -
- Advertisment -
  • విద్యార్థి ఆత్మహత్య

ఆర్థిక పరిస్థితి అంతంతగా ఉన్నా ఆ తల్లిదండ్రులు కొడుకు ఫోన్ కొనివ్వమని అడగ్గానే కొనివ్వలేకపోయారు. ఇప్పుడు కుదరదు అంటూ మందలించారు. దీంతో సాయిరాం తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతత మాత్రం. తండ్రి వ్యవసాయం చేస్తుంటే, తల్లి బీడీలు చుడుతూ కుటుంబానికి అండగా ఉంటుంది. కాయ కష్టం చేసి కుటుంబాన్ని చూసుకుంటున్నారు. ఇంతలో ఓ బిడ్డ ఆత్మహత్య వారిని పుట్టెడు దుఖఃలో నింపింది. కన్న కొడుకు అడిగిన దాన్ని కొనిచ్చే ఆర్థిక స్థోమతలేక వారికి కడుపుకోత మిగిలింది. ఈ విషాదకరమైన ఘటన జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొల్వాయి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆకుల రాజేశం, శంకరవ్వ దంపతులు.

ఆర్‌వోఆర్ స్థానంలో ‘రైట్స్‌’ బిల్లు..?

సాఫీగా సాగుతున్న వీరి కుటుంబంలో స్మార్ట్ ఫోన్ తీవ్ర విషాదం నింపింది. చిన్న కుమారుడు సాయిరాం.. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. కరోనా కారణంగా స్కూల్‌లు మూతపడటంతో ప్రస్తుతం ఆన్‌లైన్‌ తరగతు లు కొనసాగుతున్నాయి. అయితే తనకు ఆన్ లైన్ క్లాసుల కోసం స్మార్ట్‌ఫోన్‌ కొనివ్వాలని తల్లిదండ్రులను కోరాడు. ఇప్పుడు ఫోన్ వద్దని తల్లిదండ్రులు చెప్పడంతో మనస్తాపం చెందిన సాయిరాం ఇంట్లోకు వెళ్లి ఉరేసుకున్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.

న్యాయం అడిగితే కులబహిష్కరణ చేశారు….

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -