end
=
Saturday, January 18, 2025
వార్తలుజాతీయంనీట్ పరీక్షకు వచ్చిన విద్యార్థినుల లోదుస్తులను విప్పించిన దుస్థితి
- Advertisment -

నీట్ పరీక్షకు వచ్చిన విద్యార్థినుల లోదుస్తులను విప్పించిన దుస్థితి

- Advertisment -
- Advertisment -

దేశ వ్యాప్తంగా నిన్న మెడిక‌ల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నీట్-2022 నిర్వహించారు. అయితే కేర‌ళ‌లోని ఓ ఎగ్జామ్ సెంట‌ర్‌లో విద్యార్థినుల ప‌ట్ల అక్కడున్న సిబ్బంది అనుచితంగా ప్రవ‌ర్తించారు.


కేరళాలోని కొల్లంలో దారుణం చోటు చేసుకుంది. నీట్ పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థినుల లోదుస్తులను విప్పించినట్లు ఆరోపణలు వచ్చాయి. మార్తోమా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పేరుతో నిర్వహిస్తున్న కాలేజీలో నిర్వహిస్తున్నపరీక్షా కేంద్రంలో ఈ ఘటన జరిగింది. మొత్తం 100 మందికి పైగా బాలికల లోదుస్తులను విప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత తాము తీవ్ర ఒత్తిడికి లోనయ్యామని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్ష అనంతరం లోదుస్తులు కుప్పలు తెప్పలుగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. లోహపు వస్తువు దొరికడంతోనే ఇలా చేయాల్సి వచ్చిందని బాధ్యులు వివరణ ఇచ్చారు. ఎక్స్టర్నల్ ఏజెన్సీల ద్వారా పరీక్ష మరియు బయోమెట్రిక్ తనిఖీలు నిర్వహించినట్లు తేలింది. దీంతో తాము మానసిక క్షోభను ఎదుర్కోవాల్సి వచ్చిందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం పరీక్ష అనంతరం లోదుస్తులు అట్టా పెట్టెల్లో వేసే పారేసినట్లు గుర్తించారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉంటే గత సంవత్సరం నీట్, జెఈఈ రెండింటిలోనూ చీటింగ్ కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ సంవత్సరం ఎన్ టి ఏ పరీక్షకు అనేక సెక్యూరిటీ ఫీచర్లను జోడించింది. ఎగ్జామ్ సెంటర్స్ లిస్ట్‌ను బయటకు వెల్లడించలేదు. పరీక్ష హాళ్లలో జామర్‌లు, సీసీటీవీలు అమర్చడంతో పాటు తనిఖీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎగ్జామ్‌కు డ్రెస్ కోడ్, ఇతర కఠిన నిబంధనలను కూడా ఎన్ టి ఏ విడుదల చేసింది. పొడవాటి చేతులు ఉండే దుస్తులు, బూట్లు, నగలు, బెల్టులు, వాచ్‌లను ఎగ్జామ్ హాల్‌లోకి అనుమతించరు.

కొన్ని ఎగ్జామ్ సెంటర్‌లను తక్కువ మంది విద్యార్థులు ఎంచుకున్నందున, నగరాల సంఖ్య తగ్గి ఉండవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనికి సంబంధి ఎగ్జామ్ నోటిఫికేషన్‌లోనే ఒక రూల్ ఉంది. ఒకవేళ ఒక నగరాన్ని ఎంచుకునే అభ్యర్థుల సంఖ్య నిర్దిష్ట సంఖ్య కంటే తక్కువగా ఉంటే ఒకటి, రెండు లేదా అంతకంటే ఎక్కువ నగరాల్లోని ఎగ్జామ్ సెంటర్లను విలీనం చేసే హక్కు ఎన్ టి ఏకి ఉంటుందని నియమాల్లో ఉంది. అభ్యర్థులు తమ సౌలభ్యం కోసం తమ రాష్ట్రంలో సొంత నగరాన్ని లేదా పొరుగున ఉండే నగరాలను మాత్రమే ఎంచుకోవచ్చు. ఇతర రాష్ట్రాల్లోని దూరపు నగరాలను ఎంచుకోలేరు. అభ్యర్థులు నగరాలను తప్పుగా ఎంపిక చేయడం వల్ల కలిగే అసౌకర్యానికి ఎన్ టి ఏ ఎలాంటి బాధ్యత వహించదు అని ఎన్ టి ఏ తెలిపింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -