end

10 కోట్ల ఆఫర్‌ కాదన్న స్టైలిష్ స్టార్‌

టాలీవుడ్‌లో ఐకాన్‌ స్టార్‌గా వెలుగొందుతున్నా అల్లు అర్జున్ . ముఖ్యంగా పుష్ప సినిమా తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. తన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న స్టైలిష్ స్టార్‌ మరోవైపు వాణిజ్య ప్రకటనలతోనూ కోట్లు సంపాదిస్తున్నాడు. ఇప్పటికే కొన్ని కంపెనీల ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈక్రమంలో ఒక్కోయాడ్‌కు రూ7.5 కోట్ల రెమ్యునేషన్‌ తీసుకుంటాడని తెలుస్తుంది. అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్‌ను ఓ గుట్కా అండ్‌ లిక్కర్‌ కంపెనీ కూడా వినియోగించుకోవాలి అనుకున్నారు. తమ సంస్థ బ్రాండ్ ఉత్పత్తులను ప్రమోట్‌ చేస్తే ఏకంగా రూ.10 కోట్ల పారితోషకం ఇస్తామని ఆఫర్‌ చేశారట. కానీ ఐకాన్‌ స్టార్‌ మాత్రం ఆ యాడ్‌ చేసే ప్రసక్తే లేదని చెప్పాడట. ప్రజలని అనారోగ్యానికి గురిచేసే అలవాట్లను ప్రోత్సహించే ఉద్దేశం లేని బన్నీ ఆ భారీ ఆఫర్‌ను ఏ మాత్రం ఆలోచించకుండా వదులుకున్నారు.

కాగా ఈ విషయం తెలియడంతో బన్నీ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. తమ హీరో మంచి మనస్సు ఉన్నోడు అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు షేర్‌ చేస్తున్నారు. ఇక కొత్త సినిమాల విషయానికొస్తే అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే దేవిశ్రీప్రసాద్‌ సారథ్యంలో మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ కూడా జరిగాయి. పుష్ప- ది రూల్‌ పేరుతో మొదటి భాగం కంటే మరింత గ్రాండియర్‌గా సుకుమార్‌ ఈ సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మొదటి భాగంలో నటించిన వారితో పాటు మరికొందరు ఫేమస్ యాక్టర్లను ఎంపిక చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

Exit mobile version