end
=
Saturday, January 18, 2025
సినీమాతనయకు స్టైలిష్‌ స్టార్ స్పెషల్‌ గిఫ్ట్..
- Advertisment -

తనయకు స్టైలిష్‌ స్టార్ స్పెషల్‌ గిఫ్ట్..

- Advertisment -
- Advertisment -

టాలీవుడ్ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సినిమాలతో పాటు కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా కుటుంబంతో ఇంట్లో సరదాగా గడుపుతారాయన. తన ముద్దుల తనయ అర్హతో చేసే అల్లరి చేష్టలు, ముద్దు ముద్దుగా మాట్లాడే వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటారు బన్నీ. కాగా నేడు బన్నీ గారాల పట్టీ అర్హ పుట్టిన రోజు. 2016 నవంబర్‌ 21 జన్మించిన అర్హ నాలుగేళ్లు పూర్తి చేసుకొని అయిదో ఏడాదిలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా తన కూతురికి బన్నీ స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చాడు. పుట్టిన రోజు శుభాకాంక్షలు మై డియర్‌ అర్హ. నీ క్యూట్‌నెస్‌, అల్లరిని నాకు అందించినందుకు థ్యాంక్యూ మై లిటిల్‌ ఏంజెల్‌’ అని కూతురికి గిఫ్ట్‌ ఇస్తున్న ఫోటోను ట్విటర్‌లో షేర్‌‌ చేశారు. కోవిడ్‌ కారణంగా అర్హ పుట్టిన రోజును ఇంట్లోనే జరిపారు. ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో ట్రైండింగ్‌గా మారాయి.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ యేడాది ‘అల వైకుంఠపురములో’ సినిమాతో మంచి విజయం సొంతం చేసుకున్న అల్లు అర్జున్‌ ఇప్పటికీ అదే జోష్‌ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తున్నాడు. కరోనా వల్ల వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీకి జోడిగా రష్మిక మందన కనిపించనుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -