బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. కొన్ని చోట్ల ఇవాళ అసెంబ్లీ తొలివిడత ఎన్నికలు జరిగాయి. ఒకపక్క ఎన్నికలపోరు సాగుతున్నా.. మరో పక్క బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానుల హోరు మాత్రం ఆగడం లేదు. సుశాంత్‌ను హత్య చేసిన వారికి తగిన శిక్ష పడాలంటూ వారు పాట్నా సహా అనేక చోట్ల ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సుశాంత్‌కు న్యాయం జరిగేలా చూసి ఓటు వేయాలని వారు పిలుపునిస్తున్నారు. సుశాంత్ బీహార్ బిడ్డ అని, అందులోనూ గొప్ప నటుడని నినాదాలు చేసిన వారు.. కొందరి స్వార్థం, దుర్మార్గానికి అతడు బలయ్యాడని, అతడికి కచ్చితంగా న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా #BiharVote4SSRJustice అనే హ్యాష్‌ట్యాగ్‌ను విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు. కాగా, హ్యాష్‌ట్యాగ్ పోస్టు చేసిన గంటల వ్యవధివలోనే వేల సంఖ్యలో ట్వీట్లు పోస్టవడం గమనార్హం.