ఈ తరం యువతను వేధిస్తోన్న ప్రధాన సమస్య బెల్లీ ఫ్యాట్. దీన్ని తగ్గించుకోవడానికన్నా కవర్ చేసుకోడానికే ఎక్కువ తంటాలు పడుతూ ఉంటారు. ఎక్కువగా తినడం లేదా ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పొట్ట చుట్టూ కొవ్వు(Cholesterol) పేరుకుపోతుంది. సమయానికి ఆహారం తీసుకోకపోయినా ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. అయితే రూపాయి ఖర్చు లేకుండా పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును సులువుగా కరిగించేయొచ్చు. ఇంట్లోనే ఎంతో సులువైన ‘పవనముక్తాసనం(Pavanamuktasana)’ వేశారంటే సరిపోతుంది. పవనం అంటే గాలి, ముక్త అంటే తొలగించడం. పేగుల్లో పేరుకుపోయిన అపాన వాయువును ఈ ఆసనం ద్వారా తొలగించేయొచ్చు. కాబట్టే దీనికి ఆ పేరు వచ్చింది. ఈ ఆసనాన్ని ప్రతి రోజు వేయడం ద్వారా బెల్లీఫ్యాట్ సమస్యను త్వరగా అధిగమించవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు(Health professionals).
(Immunity Power:చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంచండి…)
ఈ ఆసనం ఎలా వేయాలంటారా..? ముందుగా నేలపై వెల్లకిలా పడుకోవాలి. దీర్ఘంగా శ్వాస పీల్చుకోవాలి. మోకాళ్లను(Knees) రెండు చేతులతో పట్టుకుని చాతీ(Chest) వరకు తీసుకురావాలి. మోకాలితో పొట్టను అదుముతూ శ్వాసను(Breath) వదులుతూ చుబుకాన్ని మోకాళ్లకు తాకించాలి. ఈ స్థితిలో కొద్దిసేపటి వరకు ఉంటూ గాఢ ఉఛ్వాస, నిఛ్వాసలను తీసుకోవాలి. అనంతరం తిరిగి యధాస్థితికి వచ్చేయాలి. ఇలా ఈ ఆసనాన్ని రెండు, మూడు సార్లు వేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఈ ఆసనం వల్ల అనేక ఉపయోగాలున్నాయి(Uses). కండరాలను బలపర్చడంతో పాటు బెల్లీ ఫ్యాట్ తగ్గిస్తుంది. జీర్ణక్రియను(Digestion) మెరుగుపరుస్తూ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. పేగులు, ఇతర ఉదర అవయవాలకు మసాజ్ చేస్తుంది. కీళ్లలో రక్తప్రసరణను మెరుగుపర్చుతుంది. అధిక బరువును(Heavy Weight) తగ్గిస్తుంది. గ్యాస్ బయటకు వెళ్లిపోతుంది.