end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంసింగూర్ డ్యాంలో దూకి వ్యక్తి ఆత్మహత్య
- Advertisment -

సింగూర్ డ్యాంలో దూకి వ్యక్తి ఆత్మహత్య

- Advertisment -
- Advertisment -
  • కారకులను శిక్షించాలని సూసైడ్ నోట్…

ఆందోల్ : పుల్కల్ మండలంలోని సింగూరు డ్యాంలో ఓ వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై నాగలక్ష్మి తెలిపారు. ఆమె కథనం ప్రకారం.. మండల కేంద్రమైన పుల్కల్ గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డి బుధవారం ఆ డ్యాంలో పడి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతుడికి భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే మరణానికి ముందు వరుసకు సోదరుడైన మాణిక్‌రెడ్డికి ఫోన్ చేసి తాను సింగూరు డ్యాంలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ చెప్పినట్లు తెలిపారు.

భారత్‌ మొబైల్‌ మార్కెట్‌లోకి Poco M2

అతని మరణానికి కారణం గ్రామానికి చెందిన చాకలి, మంగలి కులాలకు చెందిన కొందరు వ్యక్తులు తన స్థలం వద్దకు వచ్చి గాలాట చేయడమే కారణమంటూ ఓ సూసైడ్ నోట్లో తెలిపాడు. మృతుడి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.  

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -