- రాణించిన వార్నర్, సాహా
- కోల్‌కతా ఖేల్ ఖతం
ఏపి, తెలంగాణ ఆర్టీసీ ఒప్పందం ఒకే
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ బెర్తు సాధించింది. 10 రోజుల క్రితం 127 పరుగులు కూడా ఛేదించలేక చతికిలపడ్డ ఆ టీమ్ ముందంజ వేసే అవకాశాలు చేజార్చుకున్నట్లు కనిపించింది. ఇప్పుడు మరొక జట్టు సహకారం లేకుండా… రన్‌రేట్ లెక్కల అవసరం రాకుండా… తమ సత్తా చాటి ప్లే ఆఫ్స్‌లోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలో వరుసగా మూడో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.
దుబ్బాక ఉప ఎన్నిక.. గెలుపు ధీమాలో ప్రధాన పార్టీలు
ముందంజ వేయాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బృందం అన్ని రంగాల్లో చెలరేగింది. టాప్‌లో దూసుకుపోయిన డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను కట్టుదిట్టమైన బౌలింగ్‌తో తక్కువ పరుగులకే నిలువరించిన హైదరాబాద్… ఆ తర్వాత వార్నర్, సాహాల మెరుపు బ్యాటింగ్‌తో 17 బంతులు మిగిలి ఉండగానే వికెట్ నష్టపోకుండానే అలవోక విజయాన్ని అందుకుంది. ముంబై గెలుపుపై ఆశలు పెంచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్… చివరి లీగ్ మ్యాచ్‌లో రైజర్స్ అద్భుత ప్రదర్శనతో ప్లే ఆఫ్స్‌కు దూరమైంది.
మహిళ వేధింపు కేసులో నటుడి అరెస్ట్..
2016 నుంచి ప్రతీ ఏటా హైదరాబాద్ టాప్–4లో నిలవడం విశేషం.సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్–2020లో లీగ్ దశను విజయవంతంగా అధిగమించింది. ప్లే ఆఫ్స్‌కు చేరే నాలుగో జట్టుగా నిలిచే ప్రయత్నంలో చెలరేగిన జట్టు ఆడుతూ పాడుతూ విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 10 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.
ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుమారుడు దుర్మరణం
పొలార్డ్ (25 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా… సూర్యకుమార్ యాదవ్ (29 బంతుల్లో 36; 5 ఫోర్లు), ఇషాన్ కిషన్ (30 బంతుల్లో 33; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. సందీప్ శర్మకు 3 వికెట్లు దక్కగా, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షాబాజ్ నదీమ్ (2/19) పొదుపుగా బౌలింగ్ చేశాడు. అనంతరం హైదరాబాద్ 17.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 151 పరుగులు సాధించింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (58 బంతుల్లో 85 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్), వృద్ధిమాన్ సాహా (45 బంతుల్లో 58 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అజేయ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చి జట్టును గెలిపించారు.
అదిరిపోయిన పవర్‌స్టార్ న్యూలుక్
శుక్రవారం జరిగే ఎలిమినేటర్‌లో బెంగళూరుతో సన్‌రైజర్స్ తలపడుతుంది. కాగా, ఈ మ్యాచ్‌లో ముంబై పలువురు న్యూ బ్యాట్స్‌మెన్‌కు అవకాశం కల్పించింది. ఇదే అదనుగా భావించిన హైదరాబాద్.. తొలుత ముంబైని స్వల్ప స్కోరుకే కట్టడి చేసింది. ఆపై ఛేదనకు దిగి వికెట్ నష్టపోకుండా విజయం సాధించింది. మూడో స్ధానంలో ఉన్న బెంగళూరును.. నెట్ రన్ రేట్ కారణంగా వెనక్కి నెట్టి ఆ స్థానానికి చేరుకుంది.
దుబ్బాక ఉప ఎన్నిక.. గెలుపు ధీమాలో ప్రధాన పార్టీలు