- హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన పాండే, విజయ్
- శంకర్ బౌలింగ్‌లో రాణించిన హోల్డర్
నిమజ్జనం సమయంలో జాగ్రత్తగా ఉండాలి
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్లతో విజయం సాధించింది. 155 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు మరో 11 బంతులు మిగిలుండగానే విక్టరీ కొట్టింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(4 పరుగులు), బెయిర్ స్టో(10 పరుగులు) త్వరగానే పెవిలియన్ చేరారు. వీరిద్దరినీ జోఫ్రా ఆర్చర్ బొల్తా కొట్టించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మానిష్ పాండే(47 బంతుల్లో, 83 పరుగులు; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) అద్భుతంగా రాణించాడు. సీనియర్ ప్లేయర్లు త్వరగా పెవిలియన్ చేరినప్పటికీ.. ఏ మాత్రం అదరకుండా ఆర్ ఆర్ బౌలర్లపై బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.
మానిష్‌ను స్ఫూర్తిగా తీసుకున్న మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ విజయ్ శంకర్(51 బంతుల్లో 52 పరుగులు;6 ఫోర్లు) చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ విజయంతో సన్‌రైజర్స్ జట్టు పాయింట్ల టేబుల్‌లో 5వ స్థానానికి చేరుకొని, ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. రాజస్తాన్ బౌలర్లలో ఆర్చర్ ఒక్కడే 2 వికెట్లు పడగొట్టాడు. సూపర్ బ్యాటింగ్‌తో అలరించిన పాండే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.
అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 154 పరుగులు చేసింది. సామ్‌సన్(26 బంతుల్లో 36 పరుగులు; 3 ఫోర్లు, 1 సిక్సర్), స్టోక్స్(32 బంతుల్లో 30 పరుగులు;2 ఫోర్లు) రాణించారు. మిగితా బ్యాట్స్‌మెన్ ఓ మోస్తరు పరుగులు చేశారు. చివర్లో ఆర్చర్(7 బంతుల్లో 16 పరుగులు; 1ఫోర్, 1 సిక్సర్) జట్టు స్కోరును 150 దాటించాడు. హైదరాబాద్ బౌలర్లలో జేసన్ హోల్డర్ 3 వికెట్లతో చెలరేగగా.. విజయ్ శంకర్, రషీద్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.
Nokia 215 4G, 225 4G VoLTE మొబైల్స్ విడుదల