end

మత్య్సకారుల అభివృద్ధే లక్ష్యం..

తూప్రాన్ : మత్య్సకారుల ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఎప్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణం చెరువులో మూడు లక్షల చేప పిల్లలను బుధవారం ఆయన వదిలారు. అదే విధంగా తూప్రాన్ మండలంలోని గుండ్రెడ్డి పల్లి చెరువులో లక్ష, యావాపూర్ చెరువులో లక్ష చేప పిల్లలను వదిలారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 100కోట్ల రూపాయల ఖర్చుతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల్లో, చెక్డ్యాం, కుంటలలో చేపలను ప్రభుత్వం వదులుతుందన్నారు. దీంతో రాష్ట్రంలో ఉన్నటువంటి బెస్త, ముదిరాజులు ఆర్థికంగా బలపడతారన్నారు. పల్లెలు ఆర్థికంగా పటిష్టం కావడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అన్నారు. గ్రామాలను ఆర్థికంగా పటిష్టం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పథకాలను  ప్రవేశ పెట్టారన్నారు.

కరోనావైరస్‌ నివారణకు ‘స్పుత్నిక్‌ వీ’ వాక్సిన్‌

కరోనా విపత్కర సమయంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను అందించారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా ఉంటుందని తెలిపారు. గ్రామాలు, పల్లెల యొక్క ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం శ్రమిస్తు న్నారు. గ్రామాల్లో ఉన్నటువంటి బెస్త, ముదిరాజులకు సొసైటీలను ఏర్పాటు చేసి సొసైటీల ద్వారా చేపల అమ్ముకునే విధంగా సౌకర్యాలు కల్పించారన్నారు. వారికి టాటా ఏసీలు, మొబైల్ వ్యాన్లు సబ్సిడీ ద్వారా ముఖ్యమంత్రి అందించారన్నారు. వచ్చే రోజుల్లో సులువుగా చేపల మార్కెట్ చేసుకోవడానికి ఫిష్ స్టాల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.

ఆర్డీవో ఇంట్లో ఏసీబీ దాడులు

కార్యక్రమంలో తూప్రాన్ మున్సిపాలిటీ చైర్మన్ రాఘవేంద్రగౌడ్, ఎంపీపీ స్వప్న వెంకటేష్ యాదవ్, జడ్పీటీసీ రాణి సత్యనారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాబుల్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, కౌన్సిలర్లు గంగపుత్ర సోదరులు ముదిరాజ్ సోదరులు టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version