end
=
Wednesday, January 22, 2025
సినీమాపవర్‌స్టార్ అభిమానులకు సర్‌ప్రైజ్‌ ..
- Advertisment -

పవర్‌స్టార్ అభిమానులకు సర్‌ప్రైజ్‌ ..

- Advertisment -
- Advertisment -

దసరా పండుగ సందర్భంగా అభిమానులకు పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. తను మరో సినిమా చేస్తున్నట్లు కళ్యాణ్‌ సాబ్‌.. సోషల్‌ మీడియా ద్వారా ఓ వీడియోను రిలీజ్‌ చేశారు. దీంతో పవన్‌ అభిమానులు ఫుల్‌ ఖుషీలో ఉన్నారు. ఇప్పటికే పవర్‌స్టార్‌ చేయబోయే వకీల్‌సాబ్‌ సినిమా సెట్స్‌పై ఉండగా.. క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా, గబ్బర్‌సింగ్‌తో బంపర్‌ హిట్‌ అందించిన హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో మరో సినిమా, సురేందర్‌ రెడ్డితో మరో సినిమా చేసేందుకు కమిట్ అయిన కళ్యాణ్‌.. సాగర్‌ కే. చంద్ర దర్శకత్వంలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించనున్నారు.
కళ్యాణ్‌ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని.. కింగ్‌ ఆఫ్‌ ఆటిట్యూడ్‌.. తెలుగు సినిమా ఫేవరేట్‌ పోలీస్‌ ఆఫీసర్‌ మరోసారి హైల్టేజ్‌ రోల్‌తో రాబోతున్నారంటూ చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. మళయాళ చిత్రం అయ్యప్పనున్‌ కొశియుమ్‌ సినిమాకు ఈ సినిమా రిమేక్‌ రాబోతున్నట్లు సినివర్గాల టాక్‌.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -