end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంNalgonda:ప్రాణాలు అంటే లెక్కలేని నర్సులు!!!
- Advertisment -

Nalgonda:ప్రాణాలు అంటే లెక్కలేని నర్సులు!!!

- Advertisment -
- Advertisment -

ప్రభుత్వ ఆసుపత్రులకు  వచ్చేవాళ్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు  వచ్చే జనాలు వారి దగ్గర సరిపడా డబ్బు లేని కారణం గా వస్తారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులను, వైద్య కోసం వచ్చే వారిని వైద్య సిబ్బంది చులకనగా చూస్తున్నారు. వైద్యం చేసే డాక్టర్ల(Doctors ) దగ్గర నుంచి స్వీపర్ల(Sweepers)వరకు అందరిలో నిర్లక్ష్యం కనిపిస్తుంది. ట్రీట్‌మెంట్‌(Treatment)కి వచ్చే వాళ్లను కనీసం మనుషులుగా కూడా చూడటం లేదనే విమర్శలు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా నల్గొండ (Nalgonda) జిల్లాలో ఓ గర్భిణి(Pregnant)ప్రసవం కోసం నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే పురుడు పోయాల్సిన నర్సులు ఆ ప్రసూతి మహిళను చిత్రవదకు గురి చేశారు. అంతే కాకుండా భర్తతో పడుకున్నప్పుడు తెలియదా అంటూ నీచ పదజాలం తో ఆమె ని దూషించారు. గవర్నమెంట్‌ ఆసుపత్రి సిబ్బంది ప్రవర్తించిన తీరు అందర్ని విచారనికి గురి చేస్తోంది. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నల్గొండ జిల్లాలో అత్యంత దారుణమైన సంఘటన కలకలం రేపింది. నల్గొండ జిల్లా కట్టంగూడు మండలం చెర్వుఅన్నారం గ్రామానికి చెందిన అఖిల తొలి కాన్పు కోసం ఎంతో ఆనందం తో బిడ్డని ఎత్తుకోవాలి అనే ఆశ తో అత్తయ్య, అమ్మ తో ఈనెల 9వ తేది న ఆసుపత్రికి వచ్చింది. 12వ తేదిన పురిటి నొప్పులు రావడంతో నర్సులకు చెప్పారు. సెల్‌ఫోన్లు చూసుకుంటూ నిర్లక్ష్యపు సమాధానం చెప్పడమే కాకుండా అంత తొందర ఉంటే వేరే  ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లమని పనికిమాలిన సలహా కూడా ఇచ్చారు. చివరకు ప్రసవం చేయడానికి కూడా నిండు గర్భిణిగా ఉన్న అఖిల పొట్టపై కాళ్లతో నొక్కుతు కాన్పు చేశారు నర్సులు. ఓవైపు పురిటి నొప్పులు మరోవైపు నర్సులు కాళ్లతో పొట్టపై తన్నడంతో నరకవేదనతో బిడ్డను ప్రసవించిన వెంటనే అఖిల ప్రాణాలు విడిచింది. తోలిచురి బిడ్డ కోసం ఇంతలా ఎదురు చూసిన తల్లిని బిడ్డను చూడకుండానే చంపేశారు. నర్సుల ఆశ్రద్ద వల్లే చనిపోయిందని అఖిల కుటుంబ సభ్యులు బావిస్తున్నారు. తన భార్య చావుకు నర్సులే కారణమని ఆరోపిస్తూ భర్త, అత్తమామలు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. నర్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈవార్త స్థానికంగా సంచలనం సృష్టించడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా హల్ చల్ అవుతోంది.

(మానవత్వం చాటిన మహిళ కానిస్టేబుల్!!!)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -