అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు హోరాహోరీ సాగుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడిపి ఎమ్మెల్యేల మధ్యం పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. సభాకార్యక్రమాలకు పదేపదే అడ్డుపడుతున్న 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. సభకు నిరంతరం అంతరాయం కలిగిస్తున్నారనే కారణంగా ఒక్క రోజు పాటు వీరిని సస్పెండ్ చేస్తున్నానని స్పీకర్ ప్రకటించారు. వరుసగా రెండో రోజు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు.
సభ నుంచి వెళ్లాలని స్పీకర్ ఆదేశించినప్పటికీ టీడీపీ సభ్యులు అక్కడే ఉన్నారు. ప్రతిపక్షాల గొంతును ప్రభుత్వం నొక్కి వేస్తోందని ఆయన ఆవేదనగా మాట్లాడారు. దీంతో మార్షల్స్ వచ్చి వారిని తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు మార్షల్స్‌పై దాడి చేశారు. మార్షల్స్‌ని కొట్టిన వారిలో టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టపాటి రవి, సత్యప్రసాద్, ఏలూరు సాంబశివరావు, బాల వీరాంజనేయులు ఉన్నారు. మరోవైపు సస్సెండ్ అయిన సభ్యులతో కలిసి చంద్రబాబు బయటకు వెళ్లారు.