కోవిడ్19 వల్ల దాదాపు 7 నెలల తర్వాత కేంద్రం సినీ, టీవీ పరిశ్రమలకు షూటింగ్‌ల కోసం అనుమతి ఇచ్చింది. ఈ విషయం నిజంగా సినిమా వర్గాలకు తియ్యని కబురు. సినీ పరిశ్రమను నమ్ముకొని కొన్ని లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి. ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుండి జూనియర్ ఆర్టిస్టులు, ముఖ్యమైన ఆర్టిస్టులు, డైరెక్టర్లు మొత్తం సీనీ పరిశ్రమలో నటించే వారు, సహయకులు, టెక్నీషియన్లు అందరు కరోనా లాక్‌డౌన్ వల్ల ఉపాధి కోల్పోయారు. 6 నెలల నుండి జీవితాలు అతలాకుతలమైపోయాయి. (అన్‌లాక్ 4.0లో సినిమా హాళ్లకు అనుమతి!)
అయితే కేంద్ర ప్రభుత్వం విడదల వారిగా అన్‌లాక్‌లు చేస్తుంది. దీనిలో భాగంగానే కోవిడ్ అన్‌లాక్ 4.0లో భాగంగా సినీ పరిశ్రమ కార్యకలాపాలకు అనుమతిలిస్తూ కేంద్ర సమాచార, ప్రచారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఉత్తర్వుల వివరాలు వెల్లడించారు. దీంతో సినీ వర్గాలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే షూటింగ్ సమయంలో ఖచ్చితమైన కోవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్క్‌లు తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. దీంతో సినీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలు మళ్లీ పెరగనున్నాయి. (మళ్లీ పెట్రో మంట !)
షూటింగ్ కోవిడ్ మార్గదర్శకాలుః
- స్టూడియోల్లో వేర్వేరు యూనిట్లకు వేర్వేరు సమయాలు కేటాయించాలి
- తక్కువ సిబ్బందితో షూటింగ్‌లో చేసుకునేలా చర్యలు తీసుకోవాలి.
- కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్స్‌లో పాల్గొనాలి.
- మేకప్ సిబ్బంది ఖచ్చితంగా పీపీఈ కిట్లు ధరించాలి.
- ఆరోగ్య సేతు యాప్‌ని నటీనటులంతా వినియోగించాలి.
- షూటింగ్ సమయంలో విజిటర్లకు అనుమతి ఇవ్వద్దు.
- చిత్రీకరణ ప్రదేశంలో తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి.
- తక్కువ సిబ్బందితో చిత్రీకరణ జరిపేలా చర్యలు తీసుకోవాలి. పరిశ్రమలో హైరిస్క్ కలిగినవారు అదనంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఫేస్ మాస్కులు, షీల్డులు పని ప్రదేశాలు, షూటింగ్ ప్రదేశాల్లో తప్పనిసరి.
- వీలైనంత వరకు ఆరు అడుగుల మేర దూరాన్ని పాటించాలి.
- లేపల్ మైకులను దూరం పెట్టాలి. లేకుంటే వాడకం వీలైనంతగా తగ్గించాలి.
- కొవిడ్ జాగ్రత్తలు తెలిపే పోస్టర్లు, సందేశాలు ఏర్పాటు చేయాలి.
- ఎంటెన్స్, ఎగ్జిట్ మార్గాలు వేర్వేరుగా ఉండాలి.
- సెట్లు, మేకప్ గదులు, వ్యానిటీ వ్యాన్లు, టాయిలెట్లను తరచుగా శానిటైజ్ చేయాలి.
- గ్లౌజులు, మాస్కులు, పీపీఈలు అందుబాటులో ఉంచుకోవాలి
- షూటింగ్ వస్త్రాలు, విగ్గులు, మేకప్ మెటీరియల్ ఇతరులతో పంచుకోకుండా చూడాలి.
- తరచుగా పని ప్రదేశాలను శానిటైజ్ చేస్తూ ఉండాలి
- సినిమా థియేటర్ల వద్ద, పార్కింగ్ ప్రదేశాల్లో రద్దీ కాకుండా చర్యలు చేపట్టాలి.
- కెమెరాలు, పరికరాలను ఒకరికంటే ఎక్కువ ఉపయోగిస్తే.. కచ్చితంగా సిబ్బంది గ్లౌజులు ధరించాలి.
- టికెట్ల అమ్మకాల్లో ముట్టుకోవాల్సిన పని లేకుండా ఆన్‌లైన్ బుకింగ్స్, ఈ-వాలెట్లు, క్యూఆర్ కోడ్ స్కానర్లు వినియోగించాలి.
- లోపలికి ప్రవేశించే మార్గాల్లో థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేయాలి.
- థియేటర్లలో సోషల్ డిస్టెన్సింగ్ అమలు చేస్తూ సీటింగ్ ఏర్పాటు చేయాలి.
ఇవికూడా చదవండిః