end
=
Sunday, January 19, 2025
క్రీడలుడ్రాగా ముగిసిన సిడ్నీ టెస్టు ..
- Advertisment -

డ్రాగా ముగిసిన సిడ్నీ టెస్టు ..

- Advertisment -
- Advertisment -
  • అదరగొట్టిన పంత్, పుజారా
    – ఓటమిని తప్పించిన అశ్విన్‌, విహారి
    – ఆసీస్‌ ఆశలు ఆవిరి

    సిడ్నీ: ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ చేజారకుండా.. టీమిండియా ఆటగాళ్లు హనుమ విహారి(23 నాటౌట్‌), అశ్విన్(39 నాటౌట్‌) అద్భుత పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారు. వీరి పోరాటం కారణంగా మూడో టెస్ట్ డ్రా అయ్యింది. 272 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో.. హనుమ, అశ్విన్ ఇద్దరూ కలిసి మరో వికెట్ పడకుండా అడ్డుపడ్డారు. ఈ ఇద్దరూ.. నాటి లక్ష్మణ్, ద్రవిడ్ జోడీని గుర్తు చేశారు. వీరిద్దరూ కలిసి 258 బంతులాడి 62 పరుగులు చేశారు. దీంతో రెండో ఇన్నింగ్సులో 131 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా 334 పరుగులు చేసింది. విజయానికి మరో 73 పరుగులు చేయాల్సి ఉండగా ఐదో రోజు ఆట ముగిసింది. దీంతో మూడో టెస్టు డ్రా అయ్యింది. నాలుగు టెస్టుల సిరీస్‌ 1-1తో కొనసాగుతోంది. బ్రిస్బేన్‌లో జరగబోయే నాలుగో టెస్టుతో సిరీస్ ఫలితం తేలనుంది.

కాగా, ఆరో వికెట్ పడకుండా.. సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడిన జోడీగా అశ్విన్‌, హనుమ విహారి రికార్డులకెక్కారు. ఆసీస్ బౌలర్లలో హాజిల్ వుడ్, లియాన్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, కమ్మిన్స్ ఒక వికెట్ తీసుకున్నాడు. సెంచరీ చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ స్టీవ్ స్మిత్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. ఇదిలా ఉంటే, టీమిండియా మాజీ ఆటగాడు, గ్రేట్ వాల్ ఇండియాగా అభిమానులు పిలుచుకునే రాహుల్ ద్రవిడ్ పుట్టినరోజున ఈ ఇద్దరూ ఆయనకు అద్భుతమైన కానుక ఇచ్చారంటూ అభిమానులు కొనియాడుతున్నారు.

స్కోర్లు:
ఆస్ట్రేలియా: 338, 312/6 డిక్లేర్డ్
భారత్: 244, 334/5

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -