end

Physical Exercise:ఎక్సర్‌‌సైజ్‌కు బదులుగా ట్యాబ్లెట్..

  • శారీరక వ్యాయామానికి ప్రత్యామ్నాయం
  • బోలు, స్ట్రోక్, షుగర్ వ్యాధి రాకుండా రక్షణ

శారీరక వ్యాయామం (physical exercise) లేకపోతే కండరాలు (muscles) ఎముకలు (bones) బలహీనం అయిపోతాయనే వాస్తవం తెలిసిందే. పైగా బోలు ఎముకల వ్యాధి, సార్కోపెనియా (Sarcopenia) వంటి బలహీనపరిచే పరిస్థితులకు దారితీస్తుంది. ఇంకొందరు సెరెబ్రోవాస్కులర్ వ్యాధులు (Cerebrovascular diseases)లేదా మంచాన పడటం వంటి ప్రాణాంతక పరిస్థితుల కారణంగా ఎక్సర్‌సైజ్ చేయలేరు. దీంతో వీరికి హృదయ (heart)సంబంధ వ్యాధులు, స్ట్రోక్, (stoke)మధుమేహం (sugar)వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి శారీరక వ్యాయామానికి ప్రత్యామ్నాయం అవసరం. కాగా ఈ అంశంపై కొన్నాళ్లుగా పరిశోధనలు (research) చేసిన శాస్త్రవేత్తలు (scientist)ఇందుకోసం ఓ డ్రగ్ (drug)కనిపెట్టి శుభవార్త చెప్పారు.

ఫిజికల్ ఎక్సర్‌సైజ్ సమయంలో కండరాలు, ఎముకల బలోపేతం.. వాటిలో అనాబాలిక్ (anabalik)మార్పులతో సమానంగా ఉంటుందని గుర్తించారు పరిశోధకులు. కొత్త రకం డ్రగ్ స్క్రీనింగ్ సిస్టమ్‌ (Screening system)ను ఉపయోగించి.. మజిల్ అండ్ బోన్‌ (Muscle and Bone)లో కలిగే మార్పులను ప్రతిబింబించే సమ్మేళనాన్ని కనుగొన్నారు. దీన్ని కెమికల్ మిరాకిల్‌ (chemical miracle)గా అభివర్ణించిన శాస్త్రవేత్తలు.. ఈ డ్రగ్‌కు ‘లోకామిడాజోల్’ (‘Locamidazole’)అని పేరుపెట్టారు. సంక్షిప్తంగా LAMZ అని పిలుస్తున్నారు.మెడికల్ జర్నల్ నేచర్‌ ( medical journal Nature)లో ఆగస్టు (august)లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, LAMZ ఎముక-ఏర్పడే ఆస్టియోబ్లాస్ట్‌ (Osteoblast)లు మరియు కండరాల, కణాల (Muscle cells) పెరుగుదలను ప్రేరేపించడమే కాకుండా.. ఎముకలను విచ్ఛిన్నం చేసి బోలు ఎముకల వ్యాధి వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే ఆస్టియోక్లాస్ట్‌ (Osteoclast)ల నిర్మాణాన్ని నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

(Menopause:మెనోపాజ్ లక్షణాలు కనిపిస్తున్నాయా?)

ఎలుకలపై టెస్ట్ ట్రయల్ (test trail)సమయంలో వాటికి ‘లోకామిడాజోల్‌’ డ్రగ్‌ను రోజుకోసారి మొత్తం 14 రోజులపాటు (14 days) అందించిన శాస్త్రవేత్తలు.. ప్రయోగం ముగింపులో రక్తం (blood), కండరాలు, ఎముకలలో ఈ ఔషధం కనుగొన్నారు. హెమటోలాజిక్ పారామితుల (Hematologic parameters)(హెమోగ్లోబిన్, హెమటోక్రిట్, ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు)పై గుర్తించదగిన ప్రతికూల ప్రభావాలు లేవు.  LAMZ- చికిత్స పొందిన ఎలుకలు లార్జర్ మజిల్ ఫైబర్ విడ్త్ (The larger the muscle fiber width), గ్రేటర్ మ్యాగ్జిమల్ మజిల్ స్ట్రెంత్, (the greater the maximal muscle strength) ఎముకల నిర్మాణం‌లో అధిక రేటు, తక్కువ ఎముక పునశ్శోషణ కార్యకలాపాలను ప్రదర్శిస్తున్నాయని పేర్కొన్నారు.   బోలు ఎముకల వ్యాధి వంటి దీర్ఘకాలిక వ్యాధుల వల్ల ఏర్పడే లోకోమోటర్ (Locomotor)బలహీనత అనేది LAMZ వంటి ఔషధాల ప్రధాన లక్ష్యాలలో ఒకటి కాగా ప్రాథమిక ప్రయోగాల ఫలితాలు (result)చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. లోకామిడాజోల్ నోటిద్వారా లేదా సబ్కటానియస్ ఇంజెక్షన్ (Subcutaneous injection)ద్వారా తీసుకోవచ్చని తెలిపిన సైంటిస్టులు.. LAMZ జనాలు కలలుగన్న సిజిల్డ్ అబ్స్‌ (Sizzled Abs)ను అందించకపోయినా.. బోలు ఎముకల వ్యాధి, సార్కోపెనియా వంటి బలహీనమైన లోకోమోషన్ (Locomotion) ఉన్న రోగులకు చికిత్సా ఔషధంగా సహాయపడుతుందని పరిశోధకులు విశ్వసిస్తున్నారు.

Exit mobile version