- FEFSI అధ్యక్షుడు సెల్వమణికి రూ.1.5 కోట్ల చెక్కు అందజేత
తమిళ స్టార్ హీరో సూర్య తన ఉదార హృదయాన్ని చాటుకున్నారు. సినిమాలతో పాటు సామాజిక బాధ్యత గల హీరో సూర్య . కరోనా మహమ్మారి వల్ల తమిళ సినిమా కార్మికులకు ఉపాధి కరువై కుటుంబ భారంతో సతమవమవుతున్నారు. చాలా మంది వైరస్ వల్ల చనిపోయారు. అయితే తమిళ సినిమా కార్మికులను ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా ఆయన కోటి 50 లక్షలు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా కు విరాళం అందజేశారు. హీరో సూర్య తండ్రి శివకుమార్, FEFSI అధ్యక్షుడు ఆర్.కె. సెల్వమణికి ఈ మేరకు చెక్కును అందజేశారు.
దళిత రైతులపై ఎమ్మెల్యే అనుచరుల దాడి
సూర్య నటించిన సురారై పొట్రు (ఆకాశమే నీ హద్దురా) అక్టోబర్ 30న అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయనున్నారు. అయితే ఈ చిత్రం ద్వారా వచ్చిన కలెక్షన్లలో తన వంతుగా రూ.5 కోట్లు కరోనా బాధితుల సహాయ నిధికి విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.